AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirai: మిరాయ్‌కు బూస్ట్ ఇచ్చిన రెబల్ స్టార్.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా మిరాయ్. హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Mirai: మిరాయ్‌కు బూస్ట్ ఇచ్చిన రెబల్ స్టార్.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
Mirai Movie ,prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2025 | 12:59 PM

Share

మిరాయ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన మిరాయ్ సినిమాకు ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందుకుంది. మిరాయ్ సినిమాకు మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ. 27 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మైథలాజికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రియ కీలక పాత్రలో నటించింది. అలాగే మంచు మనోజ్ విలన్ గా నటించి మెప్పించారు.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

ఇప్పటికే ఈ సినిమా రూ. 50కోట్లకు పైగా వసూల్ చేసి నాయ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలు చూసిన ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా మిరాయ్ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాలో ప్రభాస్ కూడా ఉన్నారు. అంటే ప్రభాస్ కనిపించలేదు కానీ సినిమాకు ఆయన వాయిస్ ఇచ్చారు. ప్రభాస్ వాయిస్ తో సినిమా రేంజ్ మరింత పెరిగింది. థియేటర్ ప్రేక్షకులకు ప్రభాస్ వాయిస్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

ఇక ప్రభాస్ మంచి మనసు గురించి ఎంత చెప్పిన తక్కువే.. మిరాయ్ సినిమాకు తన వాయిస్ ఇచ్చి సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చారు ప్రభాస్. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క పైసా కూడా తీసుకోలేదట. తన వాయిస్ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ చెప్పగానే ప్రభాస్ ఓకే చేశాడట. దాంతో ప్రభాస్ ను మరోసారి అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. మా ప్రభాస్ మనసు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మిరాయ్ సినిమా ఓటీటీ రైట్స్ ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అక్టోబర్ చివర్లో మిరాయ్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.