Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో మెరిసిన నేషనల్ క్రష్.. చీరకట్టులో రష్మిక ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

|

Jun 26, 2024 | 8:22 PM

చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా తాజాగా ఓ పెళ్లిలో మెరిసింది. కర్ణాటకలో తన స్వస్థలమైన కొడుగులో తన స్నేహితురాలి వివాహానికి హాజరైంది. ఈ సందర్భంగా అక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా చక్కని చీర కట్టులో ఎంతో అందంగా ముస్తాబైంది.

Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో మెరిసిన నేషనల్ క్రష్.. చీరకట్టులో రష్మిక ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
Rashmika Mandanna
Follow us on

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన్నా. ఇందులో శ్రీ వల్లిగా ఆమె అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక గతేడాది రణ్ బీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటించిందీ అందాల తార. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలతో అభిమానుల హృదయాల్లో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప 2 సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉంటోంది. అలాగే ఓ లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది. ఇలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా తాజాగా ఓ పెళ్లిలో మెరిసింది. కర్ణాటకలో తన స్వస్థలమైన కొడుగులో తన స్నేహితురాలి వివాహానికి హాజరైంది. ఈ సందర్భంగా అక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా చక్కని చీర కట్టులో ఎంతో అందంగా ముస్తాబైంది. వివాహం అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది రష్మిక.

.’నా హృదయం, నా చరిత్ర ఈ కొడగులోనే ఉంది. ఇక్కడ నేను, నా స్నేహతులందరూ కలిసి పెరిగాం. నీ వివాహ వేడుకలో నువ్వు బిజీగా ఉన్నందున నీతో కలిసి ఫోటో తీసుకోలేకపోతున్నాం. నువ్వు నీ భాగస్వామితో జీవితాంతం ఆనందంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా..దేవుడా! మా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నా’ అంటూ తన స్నేహితురాళ్లతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. సంప్రదాయ చీర కట్టులో రష్మిక ఎంతో క్యూట్ గా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్నేహితురాలి పెళ్లిలో రష్మిక.. ఫొటోస్ ఇదిగో..

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..