Raashii Khanna: స్పీడ్ పెంచిన రాశీ ఖన్నా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ

|

May 29, 2022 | 4:33 PM

అందాల భామ రాశిఖన్నా(Raashii Khanna).. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది బబ్లీ బ్యూటీ.

Raashii Khanna: స్పీడ్ పెంచిన రాశీ ఖన్నా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ
Rashi Khanna
Follow us on

అందాల భామ రాశిఖన్నా(Raashii Khanna).. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది బబ్లీ బ్యూటీ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే మంచి అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో ఈ కుర్రాది దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్‌ చిత్రంలో నటిస్తోంది రాశి. దీంతోపాటు నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూ సినిమాలో స్క్రీన్ షేర్‌ చేసుకోనుంది. వీటితో పాటు సర్దార్‌ (తమిళం), యోధా(హిందీ), షైతాన్‌ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాలతార.

తాజాగా ఈ బ్యూటీ ఫార్జి అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ గా రాజ్ నిధిమోర్ కృష్ణ DK ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సిరీస్ కు డబ్బింగ్ మొదలు పెట్టింది రాశి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది రాశి. వెబ్ సీరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా  చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. రెజినా కాసాండ్రా కూడా ఈ ప్రాజెక్టులో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి

Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..