
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి.దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ విజయ్- రష్మికల సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దసరా సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రణబాలి సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లోనూ విజయ్ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుక్ మై షోలోనూ గంటకు కనీసం 10వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే రణబాలి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఒక ఇంటర్వ్యూ సందర్బంగా రణబాలికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ రణబాలి సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించాలని నాకు ఎంతో ఆసక్తి ఉంది. రణబాలి తండ్రి, జయమ్మ, గౌడప్పల గత జీవిత కథల ఆధారంగా రణబాలి ప్రీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. వారి జీవితాలను రణబాలి విధితో, అతని కొడుకు భవిష్యత్తుతో, పోర్టు నుంచి తప్పించుకున్న బ్రిటిష్ వ్యక్తితో ముడిపెడుతూ కథను రూపొందించాలని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ రాహుల్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రణబాలి సినిమా ఫ్రీక్వెల్ వార్తలపై విజయ్- రష్మికల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రణబాలి 2 రావడానికి చాలా సమయం పట్టనుందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్- రష్మికలు పలు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తి అయిన తర్వాతనే రణబాలి ఫ్రీక్వెల్ ఉండవచ్చని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.