Ram Charan- Irumudi: స్వామి శరణం.. రవితేజ ‘ఇరుముడి’ సినిమాపై రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు. సినిమా షూటింగ్‌లు, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఎంతో నిష్టతో ఈ దీక్షను పూర్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరుముడి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రామ్ చరణ్.

Ram Charan- Irumudi: స్వామి శరణం.. రవితేజ ఇరుముడి సినిమాపై రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
Ram Charan, Irumudi Movie

Updated on: Aug 26, 2026 | 12:02 PM

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ఇరుముడి. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఇరుముడి సినిమాకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇరుముడి సినిమాకు ఫిదా అవుతున్నారు. థియేటర్లలో చూసి మరీ రవితేజ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇరుముడి సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకన్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇరుముడి సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘రవితేజ అలాగే ఇరుముడి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు. ‘ఈ సినిమాకు లభిస్తోన్న ఆదరణ, స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. రవితేజ గారు చిత్ర బృందం తమ కృషికి పూర్తి ప్రశంసలకు అర్హులు. డైరెక్టర్ శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇతర చిత్ర బృందం భవిష్యత్ లో మరిన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

అంతకు ముందు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇరుముడి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇరుముడి సినిమా నా మనసును ఎంతగానో హత్తుకుంది. సాధారణంగా చిన్నతనంలో మనకేదైనా జరిగినా లేదా ఏదైనా మనల్ని బాధించినా, అమాయకత్వంతో మన మొదటి స్పందన పెద్దవాళ్లకు చెప్పడమే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు నిజం అర్థమవుతుంది.. ఏం జరిగినా సరే నోరు మూసుకుని ఊరుకోవాలని మనకు చెబుతారు… ఈ సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజ్. కచ్చితంగా ప్రస్తావించాల్సిన, మాట్లాడాల్సిన ఒక విషయాన్ని ఈ చిత్రం ఎత్తిచూపింది’ అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపింది రష్మిక.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ ట్వీట్..

ఇక ఇరుముడి సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

రష్మిక మందన్నా ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us