మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా.? ఎప్పుడు టైటిల్, లుక్ ఇలా అప్డేట్స్ ఇస్తారా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాని SSMB 29 అని పిలుస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమాని అనౌన్స్ చేయగానే టైటిల్ కూడా రివీల్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు చాలా నెలల క్రితమే వెల్లడించారు. ఇప్పుడు షూటింగ్‌కి రోజులు దగ్గర పడ్డాయి. జనవరి నుంచి షూటింగ్ బ్రేక్ లేకుండా సాగుతుందని అంటున్నారు.
మంగళవారం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు SS రాజమౌళి. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా అదే ప్రదేశం నుంచి కొన్ని చిత్రాలు, వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం లొకేషన్ వేటలో ఉన్నారని కార్తికేయ హింట్ ఇచ్చాడు. రాజమౌళి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌ను రాజమౌళి సందర్శించారు. ఆ ఫ్రేమ్‌లో చాలా జీబ్రాలు కూడా కనిపిస్తాయి. రాజమౌళి ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఇందులో ఎక్కువ జంతువులు కనిపిస్తాయని చెప్పారు.
అందుకు తగ్గట్టుగానే షూటింగ్ లొకేషన్స్ కు వెతికే పనిలో పడ్డారు రాజమౌళి. బాహుబలి, బాహుబలి 2, RRR వంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి.. మహేష్ బాబు సినిమాను ప్రపంచ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. అయితే ఇందులోని కొన్ని ముఖ్యమైన భాగాలను విదేశాల్లో కూడా చిత్రీకరించనున్నారని. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.