
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది అందాల తార రష్మిక మందన్న. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి బడా హీరోల సరసన నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక తెలుగుకే పరిమితం కాకుండా రష్మిక తాజాగా బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఒకేసారి ఏకంగా రెండు బాలీవుడ్ చిత్రాలకు రష్మికా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే రష్మిక తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్మిక ట్వీట్ చేస్తూ.. `పెద్ద పనులు చేయాలనుకుంటున్న అమ్మాయి.. చిన్నచిన్న పనులను తన చెంతకు రానివ్వదు.. అని ఎవరో చెప్పారు. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది`అంటూ ఓ ఆసక్తికర క్యాప్షన్ జోడిస్తూ.. తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేసింది. దీంతో అసలు రష్మిక చెంతకు రానివ్వని ఆ చిన్న పని ఏంటి.? రష్మిక ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందన్న దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ రష్మిక చేసిన ఈ పోస్ట్ అర్థమేంటో తనకే తెలియాలి.
Faria Abdullah: ‘ఢీ’ సిక్వెల్ చేయనున్న శ్రీనువైట్ల.. మంచు విష్ణుకు జోడిగా ‘జాతి రత్నాలు’ బ్యూటీ ?
రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.