Darshan: జైలు నుంచి రిలీజైన హీరో దర్శన్‌కు బిగ్ షాక్.. పోలీసుల కీలక నిర్ణయం!

|

Oct 31, 2024 | 5:27 PM

రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ బుధవారం (అక్టోబర్ 30) జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నటుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున చికిత్స కోసం కర్ణాటక హైకోర్టు అతనికి ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Darshan: జైలు నుంచి రిలీజైన హీరో దర్శన్‌కు బిగ్ షాక్.. పోలీసుల కీలక నిర్ణయం!
Actor Darshan
Follow us on

రేణుకా స్వామి హత్యకేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన హీరో దర్శన్ కు పోలీసులు భారీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. దర్శన్ కు బెయిల్ మంజూరైన తర్వాత అక్టోబరు 30 సాయంత్రం సీనియర్ పోలీసు అధికారులు దర్యాప్తు బృందంతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన్‌కు త్వరలో గట్టి షాక్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దర్శన్ బెయిల్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం (నవంబర్ 4) మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలపై అప్పీలు చేస్తే దర్శన్‌కు ఎదురుదెబ్బ తగలవచ్చని తెలుస్తోంది.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో దర్శన్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అతనికి అభిమానులు భారీగా ఉన్నారు. దీంతో ఇప్పుడు మంజూరైన బెయిల్ పీరియడ్ ను ట్రీట్ మెంట్ కోసమే వాడుకుంటున్నారని చెప్పలేం. వారు సాక్షులను కూడా బెదిరించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పోలీసులు సుప్రీంకోర్టులో చెప్పే అవకాశం ఉంది. రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్ జూన్ 11న అరెస్టయ్యాడు. బెంగళూరులో ఉన్న అతడిని భద్రతా కారణాల రీత్యా బళ్లారి జైలుకు తరలించారు. తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా అతను నడవలేని పరిస్థితి ఏర్పడింది. సర్జరీ కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కర్ణాటక హైకోర్టు విచారించి దర్శన్ కు బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా దర్శన్‌కు ఆరు వారాల షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో దర్శన్ భార్య విజయలక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కామక్య ఆలయ ఫోటోను పోస్ట్ చేసి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవి ఆశీస్సులతో తన భర్తకు బెయిల్ లభించిందని హర్షం వ్యక్తం చేసింది.

దర్శన్ అభిమానుల సంబరాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి