Pocket Rockkets: పాకెట్ రాకెట్స్ నుంచి ది ఫ‌స్ట్ హ్యాండ్.. క్యూరియాసిటీ పెంచుతోన్న టీజ‌ర్‌

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న సినిమా ‘పాకెట్ రాకెట్స్’. తాజాగా ఈ సినిమా పాకెట్ రాకెట్స్.. ది ఫ‌స్ట్ హ్యాండ్’ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంది.

Pocket Rockkets: పాకెట్ రాకెట్స్ నుంచి ది ఫ‌స్ట్ హ్యాండ్.. క్యూరియాసిటీ పెంచుతోన్న టీజ‌ర్‌
Pocket Rockets

Updated on: Nov 03, 2026 | 7:41 PM

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫ‌స్ట్ హ్యాండ్’ రిలీజ్‌..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజ‌ర్‌. తాజాగా విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శ్రీలంక‌లో అంద‌మైన రిసార్ట్ నుంచి ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తోన్న ఓ యువ‌కుడు ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫ‌స్ట్ టైమ్ బావుంది’ అని అంటాడు. దానికి మ‌రొక‌డు ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోక‌ల్ బ‌స్తీ గ‌య్స్‌.. ఐయామ్ ది ఓన‌ర్ ఆఫ్..’ అంటూ డైలాగ్ చెబుతాడు. అక్క‌డ నుంచి గ్యాంబ్లింగ్ జ‌రిగే ప్ర‌దేశాన్ని చూపిస్తారు. బ‌స్తీలో ఉండే ఇద్ద‌రు కుర్రాళ్లు చ‌దువుకుంటూ బ‌త‌కు వెళ్ల‌దీయ‌టానికి చాలా క‌ష్టాలు ప‌డుతుంటారు. ఇక జీవితం ఎప్పుడు బాగుప‌డుతుందా! అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ల జీవితంలో ఓ అంద‌మైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు వాళ్ల లైఫ్స్ ఎలాంటి మ‌లుపులు తీసుకున్నాయి. ఆ అమ్మాయి.. ఇద్ద‌రి ఫ్రెండ్స్‌ని శ్రీలంకకి ఎందుకు పంపిస్తుంది. అక్క‌డ నుంచి వాళ్ల జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది అనేది తెలుసుకోవాలంటే ‘పాకెట్ రాకెట్స్’ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా.. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి మంగ‌ళ‌వారం రోజున ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం..అక్క‌డ వాళ్ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్ ప‌రిచ‌యం.. అక్క‌డి నుంచి క‌థ‌లో కీల‌క మ‌లుపులు.. వీట‌న్నింటిని క‌ల‌గ‌లిపిన ఫ‌స్ట్ హ్యాండ్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us