పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ కు ఆయన స్వాగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉంటారా.? పవన్ సినిమాలంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. అటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అభిమానులను ఆకట్టుకునేందుకు రాజకీయాలతో పాటు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తున్న పవర్ స్టార్. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి పవర్ స్టార్ బర్త్ డే అంటే మాములుగా ఉండదుగా.. ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ బర్త్ డే కు మూడు రోజుల ముందు నుంచే అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఆయన నటించిన గుడుంబా శంకర్ సినిమాను రీ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాలో ఆయన స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో పవన్ ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం అప్పట్లో సెన్సేషన్. డిఫరెంట్ స్టైల్ తో కనిపించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు పవన్. అలాగే ఆతర్వాత వచ్చిన బాలు సినిమాలోనూ డిఫరెంట్ స్టైల్ ప్యాంట్ వేసి ట్రెండ్ సెట్ చేశారు.
MANISHARMA – FUCK THE WORLD
Rap by @Premgiamaren #GudumbaShankar4K #GudumbaShankarReRelease pic.twitter.com/YrfVAh0CbD— Bad Phase (@Nayan_Tarse) August 31, 2023
అప్పట్లో ఈ ప్యాంట్లకు యమా క్రేజ్ ఉండేది బాలు ప్యాంట్స్ గా బాగా పాపులర్ అయ్యాయి ఇవి. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను ఎవరికీ గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా..? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు గిఫ్ట్ గా ఇచ్చారట.
Gudumbaa maina 💥 at Sandhya 70mm , Rtc x roads 🔥🥵#GudumbaShankar4K #GudumbaShankarReRelease pic.twitter.com/tc818JI32Y
— Team Pawan Kalyan Editors (@TeamPKEditors) August 31, 2023
ఆ ప్యాంట్ లను తేజ్ తన మొదటి సినిమా రేయ్ లోనూ వాడారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అవవడంతో అది పెద్దగా హైలైట్ కాలేదు. ఇక పవన్, తేజ్ కలిసి రీసెంట్ గా బ్రో సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది.
Actress Meera Jasmine about #GudumbaShankarReRelease🔥pic.twitter.com/YqmvADORSi
— కొమరం పులి (@SingleMan122) August 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.