Pawan Kalyan Birthday: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ అభిమానులకు పూనకాలే..

|

Sep 02, 2021 | 5:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమానుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

Pawan Kalyan Birthday: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ అభిమానులకు పూనకాలే..
Follow us on

#PSPK28: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమానుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న  హరి హర వీరమల్లు సినిమానుంచి కూడా అప్డేట్ వచ్చింది. మొగలాయిలా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ మూవీ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. ఇలా వరుస సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి. తాజాగా మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. పవన్‌తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో బైక్ పై పవన్ స్టైల్‌గా కూర్చొని గన్ పట్టుకొని ఉన్నట్టుగా డిజైన్ చేశారు. పోస్టర్ వెనక ఇండియా గెట్‌ను చూపించారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. మరో సారి పవన్‌తో హరీష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ