Uma Maheswari: ఆ కారణంతోనే ఎన్టీఆర్ చిన్నకూతురు మరణించింది.. నివేదికిచ్చిన ఉస్మానియా వైద్యులు..

ఆమె మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన ఉస్మానియా హాస్పిటల్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదికను శుక్రవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ పోలీసులకు అందజేశారు.

Uma Maheswari: ఆ కారణంతోనే ఎన్టీఆర్ చిన్నకూతురు మరణించింది.. నివేదికిచ్చిన ఉస్మానియా వైద్యులు..
Uma Maheswari

Updated on: Aug 05, 2022 | 6:16 PM

దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Uma Maheswari) గత నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్‏కు ఉరివేసుకుని తనువు చాలించారు. అయితే మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు పోలీసుకులకు తెలిపారు. సోమవారం మృతి చెందిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు బుధవారం ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. తాజాగా ఆమె ఉరేసుకోవడం వల్లే మృతి చెందిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆమె మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన ఉస్మానియా హాస్పిటల్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదికను శుక్రవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ పోలీసులకు అందజేశారు.

ఉరివేసుకోవడం వల్లే ఆమె మృతి చెందిందని ఆ నివేదికలో తేల్చీ చెప్పారు వైద్యులు. ఉరేసుకోవడంతో ఆమె మెడ భాగంలో స్వరపేటిక విరిగిందని, ఈ కారణంతోనే ఆమె మరణించిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తన మేనత్త కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ గురువారం పరామర్శించారు. సతీమణి లక్ష్మీ ప్రణతితోపాటు… ఆయన తల్లి.. అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us