AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: రామాయణంలో విభీషణుడి భార్య ఇలా ఉంటుందా ?.. మరో సమస్యలో ఆదిపురుష్..

వాల్మీకి రాసిన రామాయణం కాకుండా.. డైరెక్టర్ ఓంరౌత్ తన ఇష్టానుసారం తెరకెక్కించి.. రామాయణాన్ని వక్రీకరించారని సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ సినిమాలో హనుమ పాత్రలు మాస్ డైలాగ్స్ పెట్టడం.. అలాగే రాముడు, సీత పాత్రల కాస్ట్యూమ్స్ పై ట్రోలింగ్ జరుగుతుంది.

Adipurush: రామాయణంలో విభీషణుడి భార్య ఇలా ఉంటుందా ?.. మరో సమస్యలో ఆదిపురుష్..
Adipurush Movie
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jun 21, 2023 | 5:45 AM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్న చిత్రం ఆదిపురుష్. ఓవైపు కలెక్షన్స్.. మరోవైపు విమర్శలు..అదే స్థాయిలో ఉన్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నెగిటివిటీ వస్తుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రభాస్ అభిమానులను నిరాశకు గురిచేసింది. వాల్మీకి రాసిన రామాయణం కాకుండా.. డైరెక్టర్ ఓంరౌత్ తన ఇష్టానుసారం తెరకెక్కించి.. రామాయణాన్ని వక్రీకరించారని సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ సినిమాలో హనుమ పాత్రలు మాస్ డైలాగ్స్ పెట్టడం.. అలాగే రాముడు, సీత పాత్రల కాస్ట్యూమ్స్ పై ట్రోలింగ్ జరుగుతుంది.

అంతేకాదు.. డైరెక్టర్ రామాయణాన్ని తెరకెక్కించాము అని చెప్పగా.. మేము అసలు రామాయణం రూపొందించలేదు అంటూ రైటర్ మనోజ్ చెప్పడంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హనుమంతుడు అసలు దేవుడే కాదు.. కేవలం భక్తుడు మాత్రమే అంటూ మరోసారి రైటర్ మనోజ్ కామెంట్స్ చేయడం మరింత వివాదాస్పదమయ్యింది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మరో సమస్యలో పడింది.

ఈ చిత్రంలో విభీషణుడి భార్య కనిపిస్తుంది. అయితే ఆమె క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఇప్పుడు ప్రజలకు నచ్చడం లేదు. నిజంగా విభీషణుడి భార్య అలా ఉంటుందా ? అనే సందేహం కలుగుతుంది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ వేసి కనిపించడం.. రాత్రివేళ గుడారాల మధ్యన బయటకొచ్చి పైట సర్దుకుని వస్తున్నట్లుగా ఆమెను చూపించడం.. ఇక లక్ష్మణుడు మూర్ఛబోతే విభీషణుడి భార్య సంజీవిని గురించి చెప్పడం.. ఆ తర్వాత ఆమె దగ్గరుండి లక్ష్మణుడికి సపర్యలు చేస్తున్నట్లు చూపించడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అలాగే రాముడి యుద్ధ శిబిరంలో ఆమె ఎందుకు ఉంది అనే అనుమానం కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ సినిమాలో విభీషణుడి భార్య గా నటించింది తృప్తి దోరద్మల్ అలియాస్ అయేష్ మధుకర్. బుల్లితెరపై ఆమె ఫేమస్ నటి.

ఇవి కూడా చదవండి
Vibhishan Wife

Vibhishan Wife

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రియాన్ పరాగ్ తర్వాత చహల్ వంతు.. ఐపీఎల్‌లో మళ్ళీ స్మోకింగ్ సెగలు
రియాన్ పరాగ్ తర్వాత చహల్ వంతు.. ఐపీఎల్‌లో మళ్ళీ స్మోకింగ్ సెగలు
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా
NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌
NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌
కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం
పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం
చల్లని ఏసీ వెనుక దాగిన ఆరోగ్య సమస్యలు.. తెలుసుకోవాల్సిన నిజాలు
చల్లని ఏసీ వెనుక దాగిన ఆరోగ్య సమస్యలు.. తెలుసుకోవాల్సిన నిజాలు
మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. ఏసీ లాంటి కూలింగ్‌
మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. ఏసీ లాంటి కూలింగ్‌
రోడ్డుపైనే ముగిసిన తండ్రీకూతుళ్ల అనుబంధం..!
రోడ్డుపైనే ముగిసిన తండ్రీకూతుళ్ల అనుబంధం..!