Saripodhaa Sanivaaram: సరిపోదా సరిపోదా శనివారం నుంచి డిలీట్ సీన్స్.. థియేటర్స్‌లో ఇవి పడుంటే.. దద్దరిల్లేది..

|

Sep 23, 2024 | 9:08 PM

దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గతంలో నాని, వివేక్ కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Saripodhaa Sanivaaram: సరిపోదా సరిపోదా శనివారం నుంచి డిలీట్ సీన్స్.. థియేటర్స్‌లో ఇవి పడుంటే.. దద్దరిల్లేది..
Saripodhaa Sanivaaram
Follow us on

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం. ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గతంలో నాని, వివేక్ కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు. దాంతో ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో ఎప్పటిలానే నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే నాని సరసన ప్రియాంక మోహన్  హీరోయిన్ గా నటించింది.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

సరిపోదా శనివారం సినిమాకు మరో హైలైట్ ఎస్‌జే సూర్య. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన సూర్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సరిపోదా శనివారం సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూడటాన్ని ఆసక్తిగా ఉన్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

స్ట్రీమింగ్ డేట్ దెగ్గర పడుతుండటంతో సరిపోదా శనివారం నుంచి డిలీట్ చేసిన సీన్స్ ను ఒకొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు సీన్స్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ఈ రెండు సీన్స్ యూట్యూబ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు సీన్స్ సినిమాలో ఉండుంటే బాగుండేది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఓటీటీలో ఈ డిలీట్ సీన్స్ ఉంటాయేమో చూడాలి. సినిమా లెన్త్ కారణంగా సినిమాలో ఆ సీన్స్ ను తొలగించారని తెలుస్తోంది. ఆ సీన్స్ పై మీరు ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే

డిలీటెడ్ సీన్ 1

డిలీటెడ్ సీన్ 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.