AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna : నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. కుబేర సక్సెస్‌ మీట్‌లో నాగార్జున..

లవ్ స్టోరీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నశేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన కథ, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్.

Nagarjuna : నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. కుబేర సక్సెస్‌ మీట్‌లో నాగార్జున..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2025 | 8:29 AM

Share

తెలుగు సినీరంగంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథలను వెండితెరపైకి తీసుకువస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా కుబేర. ఇందులో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి.. మూవీ టీంను అభినందించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కుబేర సినిమా విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. నాగ్ మాట్లాడుతూ.. “దీపక్ పాత్ర చుట్టూ ఇతర పాత్రలు తిరుగుతాయని శేఖర్ కమ్ముల కథ చెప్పినప్పుడే నాకు చెప్పారు. అందుకే ఇది నా సినిమా (దీపక్ గా నటించడాన్ని ఉద్దేశించి) అని భావించి చేశానని ప్రెస్ మీట్ లో చెప్పాను. దానిని వక్రీకరిస్తూ సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు.. ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అంటూ కొన్ని మీమ్స్ చూశాను. అలాగే కొన్ని వెబ్ సైట్స్ వార్తలు వచ్చాయి. ఇది దేవా (ధనుష్ పోషించిన పాత్ర పేరు) సినిమా. ఇది దీపక్ సినిమా.. ఇది సమీర సినిమా..అన్నింటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా ” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించగా.. మంచి చెడుల మధ్య సతమతమయ్యే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us