AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya- Sobhita: నాగచైతన్య- శోభిత నిశ్చితార్థం.. కాబోయే జంట మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌ హీరో, యువసామ్రాట్‌ అక్కినేని నాగతచైతన్య రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చైతూ నిశ్చితార్థం జరిగింద. గురువారం (ఆగస్టు 08) హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగిన ఎంగేజ్ మెంట్ వేడుకకు

Naga Chaitanya- Sobhita: నాగచైతన్య- శోభిత నిశ్చితార్థం.. కాబోయే జంట మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంతో తెలుసా?
Naga Chaitanya, Sobhita Dhulipala
Basha Shek
|

Updated on: Aug 08, 2024 | 6:50 PM

Share

టాలీవుడ్‌ హీరో, యువసామ్రాట్‌ అక్కినేని నాగతచైతన్య రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చైతూ నిశ్చితార్థం జరిగింద. గురువారం (ఆగస్టు 08) హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగిన ఎంగేజ్ మెంట్ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక చైతన్య-శోభిత ఎంగేజ్ మెంట్ ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరారు. దీంతో ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాబోయే జంటకు అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియలో నాగ చైతన్య- శోభితల గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే వీరిద్దరి వయసు ఎంత? ఇద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందనే విషయాలను నెటిజన్లు ఆరాతీస్తున్నారు.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్..ఇలా అన్ని భాషల సినిమాల్లో నటించి మెప్పించిన శోభిత ధూలిపాళ్ల మన తెలుగు అమ్మాయే. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఏపీలోని తెనాలి. 1992 మే 31న శోభిత జన్మించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. మరోవైపు అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాద్ లో పుట్టాడు. ప్రస్తుతం చైతు వయసు సుమారు 37 ఏళ్లు.ఈ లెక్కన చూస్తే నాగ చైతన్య, శోభితల మధ్య ఏజ్ గ్యాప్ కేవలం 5 ఏళ్లు మాత్రమే.

ఇవి కూడా చదవండి

గతంలో పలు సార్లు జంటగా కనిపించారు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట రూమర్స్ తెగ వైరలయ్యాయి. గతేడాది లండన్‌లో ఓ రెస్టారెంట్‌లో కనిపించడం, ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరు విదేశాల్లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడీ రూమర్లనే నిజం చేస్తూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. త్వరలోనే వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎంగేజ్ మెంట్ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు