SriCharan Pakala : సినిమాటోగ్రాఫర్‏కు ప్రమాదం.. కాపాడమంటూ వేడుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్.. విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్..

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు..

SriCharan Pakala : సినిమాటోగ్రాఫర్‏కు ప్రమాదం.. కాపాడమంటూ వేడుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్.. విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్..
Sricharan Pakala

Updated on: Jun 07, 2021 | 1:04 PM

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.. ఆయనను కాపాడాలంటూ పలువురు సినీ ప్రముఖులను కోరారు శ్రీచరణ్ పాకాల. తన స్నేహితుడికి ఆసుపత్రి ఖర్చుల కోసం దాదాపు పది లక్షల వరకు అవసర ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కీట్టో సంస్థ ద్వారా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీచరణ్. ఆయన ట్వీట్‏కు పలువురు సెలబ్రెటీలు స్పందించి.. తగిన సాయం చేశారు. శ్రీచరణ్ పాకాల గూఢచారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ సినిమా ద్వారానే అడివి శేష్‏తో ఉన్న అనుబంధంతోనే ఆయనను కూడా విరాళం అడిగారు. నా స్నేహితుడు ఇప్పుడిప్పుడే సినిమాటోగ్రఫర్ గా ఎదుగుతున్నారు. తనకు రోడ్డు ప్రమాదం జరిగ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దయచేసి సాయం చేయండి అని ట్విట్టర్ వేదికగా.. సత్యదేవ్..కోన వెంకట్… అడివి శేష్ వంటి వారిని కోరారు. అయితే శ్రీచరణ్ ట్వీట్‏కు స్పందించిన సత్యదేవ్.. తన వంత సాయాన్ని అందించారు. ఆయనకు థ్యాంక్స్ చెప్పారు శ్రీచరణ్. కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాకుండా.. మిగత వారు కూడా స్పందించి సాయం చేయాలని కోరారు. శ్రీచరణ్.. క్షణం, గరుడవేగ, అశ్వాథ్థామ, గూఢచారి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ట్వీట్..

Also Read: Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..

Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..

 

Follow Us