టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గానూ మెగాస్టార్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం (సెప్టెంబర్ 22) హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికెట్ ను అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని రోజులగా మెగాస్టార్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. సుమారు 25 రోజులుగా చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. దీనికి సంబంధించి చికిత్స కూడ తీసుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే చికున్ గున్యా నుంచి క్రమంగా కోలుకుంటున్నారట. అయితే గిన్నిస్ బుక్ ప్రతినిధుల పిలుపు మేరకు ఒంటినొప్పుల తోనే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు మెగాస్టార్.
స్టేజ్ మీదకు వెళుతున్న సమయంలో కూడా మేనల్లుడు హీరో సాయి ధరమ్‌తేజ్ చిరుకు సాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మెగాస్టార్ చిరంజీవికి చోటు దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. ‘ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు’ అంటూ ట్విట్టర్ వేదికగా చిరుకు విషెస్ తెలిపారు రేవంత్ రెడ్డి.
ప్రముఖ సినీ నటుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు.
— Revanth Reddy (@revanth_anumula) September 22, 2024
MEGASTAR #Chiranjeevi garu about His Songs has Repeat Audience
In my Journey Songs and Dance become a part in my LifeBoss @KChiruTweets Thanking to All#MegastarChiranjeevi #GuinnessRecordForMEGASTAR pic.twitter.com/ofCyWCS8cr
— Chiranjeevi Army (@chiranjeeviarmy) September 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.