Acharya Movie: ఆ స్పెషల్ రోజుపై కన్నేసిన ఆచార్య.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా ?

|

Sep 09, 2021 | 12:32 PM

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు.

Acharya Movie: ఆ స్పెషల్ రోజుపై కన్నేసిన ఆచార్య.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా ?
Acharya
Follow us on

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు.. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నాడు చిరు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దా పాత్రలో నటిస్తుండగా.. కాజల్ హీరోయిన్‏గా.. పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవల కోవిడ్ కేసులు తగ్గి.. థియేటర్లు తెరుచుకున్న ఆచార్య సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే గతంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మేకర్స్… దీపావళికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సన్నహాలు కూడా చేస్తున్నారట. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అలాగే ఇందులో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్‏కే.. బిగ్‏బాస్ షోపై మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

MAA Elections 2021: ముదురుతున్న మా వివాదం.. మోహన్ బాబుకు మాత్రమే చెప్తానంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

Allu Arha: బుజ్జి గణపయ్యను తయారు చేసిన బన్నీ గారాలపట్టి.. అమ్మాయిగారి టాలెంట్ అదుర్స్ అంటున్న నెటిజన్లు..

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ పై మానస్ అసహనం.. ఓవరాక్షన్ ఎక్కువైందంటూ కామెంట్స్..