Prasanth Varma: సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ న్యూ మూవీ హనుమాన్.. సినిమాలో హీరోగా మెగా మేనల్లుడు..

తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు.

Prasanth Varma: సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ న్యూ మూవీ హనుమాన్.. సినిమాలో హీరోగా మెగా మేనల్లుడు..
Hanuman
Follow us

|

Updated on: May 31, 2021 | 7:10 AM

Prasanth Varma: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడాలి విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రశాంత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. ఆతర్వాత మరో సరికొత్త జోనర్ లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. టాలీవుడ్ లో మొదటిసారి జాంబీల కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అతడు హను-మాన్ అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ ని ప్రకటించాడు.

ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హను-మాన్ అనే ఫిక్షనల్ పాత్రలో నటించే హీరో ఎవరు? అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. కాన్సెప్ట్ పోస్టర్ తో ప్రశాంత్ ఆసక్తిని పెంచాడు. ప్రస్తుతానికి ఇంకా బౌండ్ స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉంది. త్వరలోనే హీరోన యూ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించే ఛాన్స్ ఉందని సూషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మెగా హీరో కోసంమీ ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడని త్వరలోనే హీరోను కలిసి కథను వినిపించే అవకాశం ఉందని ఆంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Film industry is cruel: అక్కడ జరిగేదంతా అదే.. టాలీవుడ్‌పై మరోసారి నోరు జారిన గోవాబ్యూటీ

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు