ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్.. ఎవరంటే.?

ఓ యాడ్‌లో హీరోయిన్‌ను ఒక కుక్క రీప్లేస్ చేసింది. వింటుంటేనే షాకింగ్‌గా ఉంది కదూ.. అది కూడా జరిగింది ఓ టాలీవుడ్ హీరోయిన్‌కు.. ఒక బ్రాండింగ్ విషయంలో ఇది చోటు చేసుకుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరో.? స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్.. ఎవరంటే.?
Tollywood

Updated on: Aug 01, 2025 | 12:25 PM

ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎంతోమంది నటీనటులు చాలా కష్టాలు పడ్డారు. కొందరు పెద్ద హీరోల అండతో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే.. మరికోనదరు అనేక అడ్డంకులను ఎదుర్కుని స్టార్‌లు ఎదిగారు. అలాంటి కోవకు చెందిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ యాడ్‌లో ఆమెను కుక్క రీప్లేస్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ సాగిస్తోంది. ఆమె ఎవరంటే.?

ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?

ఇవి కూడా చదవండి

ఇప్పుడు సూపర్ స్టార్స్ అని పిలవబడే నటీనటులు.. ఒకప్పుడు తమ కెరీర్‌ను అట్టడుగు నుంచే ప్రారంభించారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నారు. ఇబ్బందులు పడ్డారు.. అయితేనేం తమ పోరాటం ఆపకుండా చిత్ర పరిశ్రమలో స్టార్స్‌గా నిలిచారు. అలా వచ్చిన హీరోయిన్ ఈమె. ఎన్నో ట్రోల్స్ ఎదుర్కుని ఇప్పుడు లైఫ్ హ్యాపీగా సాగిస్తోంది. ఆమె మరెవరో కాదు. శోభిత దూళిపాళ. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడి.. అక్కినేని కుటుంబంలోకి ఇటీవలే అడుగుపెట్టింది ఈ అందాలభామ. ‘మంకీ మ్యాన్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’, ‘పొన్నియిన్ సెల్వన్ 2’, ‘ది నైట్ మేనేజర్’ లాంటి వాటిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఓ యాడ్ షూట్‌లో తనను కుక్కతో రీప్లేస్ చేశారని.. ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కొన్నేళ్ళ కిందట శోభితకు రాత్రి 11:30 గంటలకు ఓ ఆడిషన్ కోసం ఫోన్ కాల్ వచ్చింది. భయం భయంగానే ఆమె ఆడిషన్‌కు వెళ్లగా.. అందులో ఆమె సెలెక్ట్ అయింది. ఆ తర్వాత షూట్ కోసం గోవా వెళ్లింది.

ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది

‘నేను యాడ్ షూట్ కోసం గోవాకు వెళ్ళాను. మొదటి రోజు షూట్ బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మళ్ళీ రీ-షూట్ చేయాల్సి వచ్చింది. ఇక రీ-షూట్ తర్వాత క్లయింట్‌కు అది నచ్చలేదు. నా కాన్ఫిడెన్స్, యాక్టింగ్ వారికి నచ్చినా.. బ్రాండ్ ఇమేజ్‌కు సరిపోలేదని.. నన్ను కుక్కతో రీ-ప్లేస్ చేశారు. కానీ ఆ షూట్‌కు నాకు డబ్బులు చెల్లించారు’ అని శోభితా తెలిపింది.

When Sobhita Dhulipala revealed she was replaced by a dog in a shoot for being ‘confident’: It was creepy !!
byu/IndianByBrain inBollyBlindsNGossip

కాగా, శోభిత తెలుగులో పలు పెద్ద చిత్రాల్లో నటించింది. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు పలు OTT లలో వెబ్ సిరీస్‌లు చేసింది. ఇక ఆమె నికర ఆస్తి దాదాపు రూ. 163 కోట్లు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శోభితా.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి