
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ క్యాబినేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవి దక్కింది. వీటితో పాటు పవన్ ఆశించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను జనసేన అధినేతకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులైన పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ పవన్ కు అభినందనలు తెలియజేశారు. ‘పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకి మంత్రిగా నియమితులైనందుకు సంతోషంగా ఉంది.మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ కృషి, అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి. ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ చీఫ్’ అని ట్వీట్ చేశాడు మనోజ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనసేన అధిపతిగా పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఆ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ఐదు శాఖలు పవన్ కల్యాణ్ కు కేటాయించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మనోజ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. మిరాయిలో నెగెటివ్ రోల్ లో కనిపించనుండగా, వాట్ ద ఫిష్ లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
The moment we’ve all been waiting for 😭
No pawan kalyan pass without liking this tweet 🔥❤️🔥🙏🏼
Let’s show the power of Janasena ❤️🔥🔥💥#DeputyCM #PawanKalyan#PawanKalyanAneNenu ざこば師匠 大谷さん 発見遺体 pic.twitter.com/Ipc8TkbEgM pic.twitter.com/4hi7fUs8qX
— ᴄᴀᴘᴛᴀɪɴ☆ (@Cap_X_Edits) June 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.