Ram Charan: ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకొని చాలా కాలమే అయినా.. ఇప్పుడు ఆ ఊసే లేదే..?

|

Jan 13, 2022 | 3:38 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేసి శంకర్ సినిమాకోసం వెయిట్ చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో రామ్ చరణ్

Ram Charan: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని చాలా కాలమే అయినా.. ఇప్పుడు ఆ ఊసే లేదే..?
Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేసి శంకర్ సినిమాకోసం వెయిట్ చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో రామ్ చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో నింపాయి. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.

వీటితోపాటు జెర్సీ సినిమాతో జాతాయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా గౌతమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మలయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా రీమేక్ హక్కులను ఎప్పుడో దక్కించుకున్నాడు. మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా అక్కడ దాదాపు 30 కోట్లకు పైగా రాబట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్ – సూరజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ చరణ్ చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ – రవితేజ కాంబినేషన్లో ఆయన ఈ సినిమా చేయనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం పై ఇంతవరకు ఊసే లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న చరణ్. మరి ఈ రీమేక్ మూవీని ఎప్పుడు షురూ చేస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..