Nivin Pauly: నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. విచారణ కచ్చితంగా జరగాల్సిందే.. ‘ప్రేమమ్’ హీరో..

|

Sep 07, 2024 | 2:54 PM

తాజాగా ఈ కేసులో మరో స్టెప్ ముందుకు వేశాడు ఈ హీరో. తన గురించి వచ్చిన అసత్య ఆరోపణలపై కచ్చితంగా విచారణ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పలువురు నివీన్ పౌలీకి మద్దతు తెలిపారు. దీంతో ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆదేశించింది.

Nivin Pauly: నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. విచారణ కచ్చితంగా జరగాల్సిందే.. ప్రేమమ్ హీరో..
Nivin Pauly
Follow us on

మలయాళీ హీరో నివీన్ పౌలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‏లో తనపై ఆత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో నివీన్ పౌలీని ఆరో నింధితుడిగా కేసు నమోదు చేశారు ఎర్నాకులం పోలీసులు. ఈ కేసులో మొదటి నిందితురాలిగా శ్రేయ అనే మహిళ పేరును చేర్చగా.. ఆ తర్వాత పలువును దర్శకనిర్మాతల పేర్లను చేర్చారు. ఇక ఏ6గా నివీన్ పౌలీని పేరు చేర్చారు. ఇప్పటికే తన పై వచ్చిన ఆరోపణలపై ఈ హీరో స్పందించారు. తన గురించి వినిపిస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని.. అవి పూర్తిగా అవాస్తవమని తన ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఈ కేసులో మరో స్టెప్ ముందుకు వేశాడు ఈ హీరో. తన గురించి వచ్చిన అసత్య ఆరోపణలపై కచ్చితంగా విచారణ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పలువురు నివీన్ పౌలీకి మద్దతు తెలిపారు. దీంతో ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆదేశించింది.

అయితే సదరు మహిళ తనపై దుబాయ్ లో దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. అయితే తాను దుబాయ్ వెళ్లలేదని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీసులకు చూపించాడు నివీన్ పౌలీ. అలాగే తన పాస్ పోర్ట్ సైతం అందించారు. నిజానిజాలు బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. ‘నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో విచారణ జరగాలి. ఈ కేసు నుంచి నా పేరును తొలగించాలి. ఈ అబద్ధాన్ని నిరూపించేందుకు నేను ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం’ అని అన్నారు నివీన్ పౌలీ.

ఇటీవల మలయాళీ ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి బయటకు రావడంతో మిగతా ఇండస్ట్రీలలోనూ హేమ తరహా కమిటీ కావాలని పలువురు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ సినీ మహిళా ఆర్టిస్టులు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.