Kasthuri: నటి కస్తూరిపై మద్రాసు హైకోర్టు సీరియస్.. ఇక అరెస్టు తప్పదా?

| Edited By: Basha Shek

Nov 13, 2024 | 9:50 PM

ఇటీవల చెన్నైలో ఓ సమావేశంలో పాల్గొన్న నటి బిజెపి నాయకురాలు కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆమెపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్‌ గా తీసుకొని కస్తూరి పై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.

Kasthuri: నటి కస్తూరిపై మద్రాసు హైకోర్టు సీరియస్.. ఇక అరెస్టు తప్పదా?
Kasthuri
Follow us on

ప్రముఖ నటి కస్తూరిపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల కేసు నుంచి బయటపడేందుకు ఓటును ఆశ్రయిస్తే అదే కోర్టు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ నేతల నుంచి వచ్చే ఆరోపణల కంటే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయింది. తమిళనాడులో తెలుగు తమిళ ప్రజల మధ్య విభేదాలు పెంచేలా ఉన్నాయంటూ ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు సంఘాలు నటి కస్తూరి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్‌ గా తీసుకొని కస్తూరి పై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. కస్తూరి అరెస్టు తప్పదు అన్న డిమాండ్ పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు కూడా నామమాత్రపు కేసులా కాకుండా సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఇంతకీ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఏంటి . నమోదైన కేసులు ఎందుకు మద్రాస్ హైకోర్టు ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేసింది… ?

ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న నటి బిజెపి నాయకురాలు కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు అనడం కంటే అవి అనుచిత వ్యాఖ్యలు అన్నంతగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం పురంలో సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడు చలామణి అవుతూ లేదా మాట్లాడుతున్నారని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతఃపురంలో ఊడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగువారు అంటే ఎంత చిన్నచూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇక నటి కస్తూరి అరెస్టు తప్పదు అని తెలిశాక ఆమె తమిళనాడు నుంచి వెళ్లిపోయారు.

విచారణకు రావాలని సామాన్లు అందజేసేందుకు పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నటి కస్తూరి పోలీసులు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు గుర్తించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తుబేలు కోసం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించారు. కస్తూరి పిటిషన్ను విచారణకు సేకరించిన మధురై బెంజ్ విచారణ సమయంలో కస్తూరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పదిమందిని ఉద్దేశించి చేసే ప్రసంగాల్లో ఆధారాలు లేకుండా ఏది అనిపిస్తే అది ఎలా మాట్లాడుతారని మధురై బెంచ్ కస్తూరి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని.. తెలుగువారు వలస వచ్చిన వారు కాదని రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భాగస్వామిగా ఉన్న వారిని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. హలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని అన్నారు. తమిళనాడులో తెలుగువారిని తమిళులను వేరుచేసి చూడలేమని పిలకవేక కూడా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి అన్నారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాదని పోలీసులను అడిగింది. వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించారా లేదా అని కూడా ప్రశ్నించింది. దీంతో కేసు విచారణను వాయిదా వేగా పోలీసుల అరెస్టు నుంచి ఉపశమనం దొరుకుతుందని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు నుంచే కస్తూరి కి సమస్య తప్పేలా లేదు అన్నట్లు మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. పరి విచారణలో కస్తూరి అరెస్టు గురించి అడ్రస్ హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంసంగా మారింది.

ఇవి కూడా చదవండి