‘మా’ ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్తతల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయి. హోరాహోరీ పోరులో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఫలితాల అనంతరం నాగబాబు, ప్రకాశ్ రాజ్ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు ఇక ఈ ఎన్నికల్లో చాలామందికి భారీ మెజార్టీ వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలో ఉన్న సుడిగాలి సుధీర్‌తో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు మంచి మెజార్టీతో గెలిచారు. అధ్యక్ష బరిలో నిలచిన మంచు విష్ణుకు 383 ఓట్లు రాగా ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. 109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. జనరల్ సెక్రటరీ రఘు బాబుకు 341 ఓట్లు రాగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ 375 ఓట్లను సంపాదించి విజయ బావుటా ఎగరవేశారు. ఇక మంచు విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఈసీ మెంబర్స్ గెలవగా.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది గెలిచారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అవకాశం అందుకున్నటువంటి సుడిగాలి సుధీర్ 279 ఓట్లను అందుకని గెలుపొందాడు. ఇక మంచు విష్ణు ప్యానల్ నుంచి బరిలో దిగిన సంపూర్ణేశ్ బాబు 285 ఓట్లను సాధించారు.
► జనరల్ సెక్రటరీ – రఘుబాబు (341 ఓట్లు)
►ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – శ్రీకాంత్ (375 ఓట్లు)
► జాయింట్ సెక్రటరీలు – ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు)
►వైస్ ప్రెసిడెంట్స్ – మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు)
► ట్రెజరర్ – శివబాలాజీ (360 ఓట్లు)
ఈసీ మెంబర్స్
శివారెడ్డి – 362 ఓట్లు
గీతా సింగ్ – 342 ఓట్లు
అశోక్ కుమార్ – 336 ఓట్లు
బ్రహ్మాజీ – 334 ఓట్లు
శ్రీలక్ష్మి – 330 ఓట్లు
సి మాణిక్ – 326 ఓట్లు
ప్రభాకర్ – 319 ఓట్లు
తనీష్ – 306 ఓట్లు
శ్రీనివాసులు – 296 ఓట్లు
హరనాథ్బాబీ – 296 ఓట్లు
సురేష్ కొండేటి – 294 ఓట్లు
ఎన్. శివన్నారాయణ – 290 ఓట్లు
సంపూర్ణేష్ బాబు – 285 ఓట్లు
శశాంక్ – 284 ఓట్లు
సమీర్ – 282 ఓట్లు
Also Read: రాయచూర్ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే.. కేటీఆర్ స్పందన ఇదే