
తెలుగు సినిమా ప్రపంచంలో గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుద్ధాల అశోక్ తేజ. దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. సినీ పాటల ప్రపంచంలో తన ప్రస్థానం అద్భుతంగా, అనూహ్యంగా సాగిందని, ప్రతిరోజూ కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. మొదటి పాట రాసినప్పుడు ఎలాంటి ఉత్సాహం, ఉత్కంఠ, భయం ఉండేవో, సంవత్సరాల తర్వాత కూడా అవే భావనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నిరంతర ఉత్సాహమే తన పాటల్లో సాంద్రత తగ్గకుండా చూస్తుందని ఆయన నమ్ముతారు. పాటల ప్రయాణంలో ఎప్పుడూ అలసట, లేదా ఇక చాలు అనే భావన రాలేదని అశోక్ తేజ అన్నారు. ఎందుకంటే పాట రాయడం అనేది ఒక ఉద్యోగం కాదని, అది ప్రతి ఒక్క సన్నివేశానికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని వివరించారు. పాట కేవలం ప్రేక్షకులకో, నటులకో కాదని, రాస్తున్న రచయితకు కూడా ఒక కొత్త జీవితాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. చాలామంది ఇతరులకు జీవితాన్ని ఇస్తామనే భ్రమలో ఉంటారని, కానీ ఒక్కొక్క పాట రచయిత జీవితాన్ని విశ్వరూపంగా తీర్చిదిద్దుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక రోజు అందమైన అమ్మాయి గురించి రాస్తే, మరుసటి రోజు విషాద మరణం గురించి రాయాల్సి ఉంటుందని, ఇలా వైవిధ్యమైన జీవితం ఎంత వైవిధ్యమైందో పాటల క్రియేషన్ కూడా అంతే వైవిధ్యంగా ఉంటుందని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
తన చిన్నతనంలోనే, ఐదవ తరగతిలో ఉన్నప్పుడే పాట తన బాట అని నిర్ణయించుకున్నట్లు అశోక్ తేజ వెల్లడించారు. నటించడం, నాటకాలు రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం వంటి అనేక ఇతర ప్రతిభలు ఉన్నప్పటికీ, ఆయన ప్రాధాన్యత ఎప్పుడూ పాటకే. ఆయన తండ్రి కూడా గేయ రచయిత కావడంతో, ఆయన ఇంట్లో పాట పుట్టకముందే వాతావరణం సిద్ధంగా ఉందని, దాన్ని “గీతావరణం”గా తెలిపారు. ఒక రచయిత తన పేరు చెప్పగానే పాట, పాట చెప్పగానే పేరు గుర్తొచ్చే స్థాయికి చేరుకోవడం చాలా ముఖ్యమని సుద్దాల అశోక్ తేజ అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
రచయితగా తన సృజనాత్మకతకు నిదర్శనంగా “రాజూ బాయ్” సినిమాలో చేపల గురించి రాసిన పాట గురించి చెప్పుకోచ్చారు. చేపల గురించి అవగాహన లేకపోయినా, అనేక మందికి ఫోన్ చేసి సమాచారం సేకరించి, “కొర్రమీనుకు సోరా చేపకు కళ్యాణం, జిల్లా రొయ్య మొప్ప నంది వైభోగం” వంటి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించడం తనకు కత్తి మీద సాము లాంటి అనుభవమని పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను స్వీకరించి, విభిన్నమైన పాటలను అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉందని సుద్దాల అశోక్ తేజ తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..