Gunturukaaram: దుమ్మురేపిన మహేష్ బాబు, శ్రీలీల.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ అదిరిపోయిందిగా..

గుంటూరు కారం సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గుంటూరుకారం సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

Gunturukaaram: దుమ్మురేపిన మహేష్ బాబు, శ్రీలీల.. కుర్చీ మడతపెట్టి సాంగ్ అదిరిపోయిందిగా..
Gunturukaaram

Updated on: Dec 30, 2023 | 4:22 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ సినిమా తెరకెక్కుతోంది. గత సినిమాలకు మించి గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. గుంటూరు కారం సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గుంటూరుకారం సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. గుంటూరు కారం సినిమా నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది.

కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో తెరకెక్కిన ఈసాంగ్ మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్ తో ఈ సాంగ్ ను తెరకెక్కించారు. ఈ సాంగ్ లో మహేష్ బాబు శ్రీ లీల డాన్స్ ఇరగదీశారు.

ఈ మాస్ బీట్ కు మహేష్ బాబు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ సాంగ్ థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. థమన్ సంగీతం అందింస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

మహేష్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్