AR Rahman: దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్‏గా.. ఇస్లాంలోకి ఎందుకు మారారో తెలుసా..

|

Nov 20, 2024 | 12:56 PM

ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న జన్మించారు. సంగీత దర్శకుడు ఆర్కే శేఖర్ తనయుడే రెహమాన్. అతడి అసలు పేరు దిలీప్ కుమార్. కానీ రోజా సినిమా విడుదలకు ముందు రెహమాన్ కుటుంబం ఇస్లాం మతంలోకి మారింది. దీంతో అప్పటి నుంచి దిలీప్ కుమార్ పేరు కాస్త రెహమాన్ గా మారింది.

AR Rahman: దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్‏గా.. ఇస్లాంలోకి ఎందుకు మారారో తెలుసా..
Ar Rahman
Follow us on

ఏఆర్ రెహమాన్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన సంగీతంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశాడు. హృదయాలను హత్తుకునే మ్యూజిక్‏తో సంగీత ప్రియులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రోజాతో మ్యూజిక్ డైరెక్టర్‏గా సంగీత ప్రయాణం స్టార్ట్ చేశాడు. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి.. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కుర్రాడు ఇప్పుడు ప్రపంచం మెచ్చే సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు రెహమాన్ వ్యకిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం తెలిసి అభిమానులు షాకవుతున్నారు. అదే రెహమాన్, సైరాబాను విడాకుల ప్రకటన.

ఆస్కార్ అవార్డ్ అందుకున్న రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటపెట్టాడు. అలాగే అతడి కుటుంబం కూడా మీడియా ముందుకు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు అనుహ్యంగా రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు అతడి భార్య సైరాబాను ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. అటు డివోర్స్ ప్రకటనపై రెహమాన్ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. దీంతో ఇప్పుడు రెహమాన్ లైఫ్ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే అసలు రెహమాన్ పూర్తి పేరు.. ఎందుకు ఇస్లాంలోకి మారారో తెలుసుకుందాం.

తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు రెహమాన్. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో చదువును మధ్యలోనే వదిలేసి.. 11 ఏళ్ల వయసులోనే పియానో, కీబోర్డు ప్లేయర్ గా ఇళయరాజా, రమేశ్ నాయుడు, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు. అయితే రెహమాన్ కుటుంబం 1989లో ఇస్లాం మతంలోకి మారింది. అప్పటి నుంచి దిలీప్ కుమార్ పేరు కాస్త రెహమాన్ గా మారింది. రోజా సినిమా విడుదలకు ముందు రెహమాన్ కుటుంబం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. దీంతో చివరి నిమిషంలో రోజా సినిమాలో అతడి పేరును రెహమాన్ గా మార్చాలని అతడి తల్లి కోరింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.