Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. 12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారింది..

|

Jan 03, 2025 | 9:59 PM

ఇండస్ట్రీలోనే ఆమె తోపు హీరోయిన్. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఓ సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగింది. చివరకు చైన్ స్మోకర్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. 12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారింది..
Vidya Balan
Follow us on

చైన్ స్మోకర్ క్యారెక్టర్ కోసం ఓ హీరోయిన్ ఏకంగా 12 కిలోలు బరువు పెరిగింది. ఆమె నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ విద్యా బాలన్. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. తాను నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. హిందీలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది. తమిళంలో విడుదలైన నేరకొండ పర్విహిలో అజిత్ భార్య పాత్రను పోషించింది. తక్కువ సమయంలోనే హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకుంది. హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మకంగా విద్యాబాలన్ చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.

2010లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీ ఆమె కెరీర్ మర్చేసింది. ఈ చిత్రంలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది. సినిమాలో చైన్ స్మోకర్‌గా ఉండాల్సి రావడంతో దాదాపు 12 కిలోల వరకు బరువు పెరిగింది. అంతేకాదు.. ఈ పాత్ర కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పొగతాగడం హానికరం కాకపోతే నేను చైన్ స్మోకర్‌గా ఉండేదానిని” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. డర్జీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగడం మానలేదని.. కాకపోతే రోజుకు 3 సిగరెట్లు తాగనని చెప్పుకొచ్చింది.

ఈ చిత్రంలో నటించేందుకు తొలుత కంగనా రనౌత్, బిపాసా బసులను చిత్ర బృందం సంప్రదించింది. వారు నిరాకరించడంతో ఆ సినిమా విద్యాబాలన్‌కి వెళ్లింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 117 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నస్రుద్దీన్ షా, తుషార్ కపూర్ నటించారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.