సినీరంగుల ప్రపంచంలోకి ఎన్నో కలలతో అడుగుపెట్టింది. 16 ఏళ్ల వయసులోనే దక్షిణాది చిత్రపరిశ్రమలోకి నటిగా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. 17 ఏళ్ల వయసులోనే అగ్రకథానాయికగా స్టార్ డమ్ అందుకుంది. చిన్న వయసులోనే స్టార్ హీరో సరసన నటించిన ఆమె 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ముంబైలోని ఐదవ అంతస్తులోని అపార్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందింది. తనే దివంగత హీరోయిన్ దివ్యభారతి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. తెలుగులో బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 1990లో వెంకటేశ్ సరసన బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన నటించింది.
కేవలం మూడు సంవత్సరాల సినీ కెరీర్ లో ఆమె తన మార్క్ చూపించింది. ఎన్నో హిట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రశంసలు అందుకుంది. ఆమె తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ దివ్య భారతి మార్క్ మాత్రం చెరిపేయలేకపోయారు. మొత్తం 21 సినిమాల్లో నటించింది. అందులో 13 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 8 చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1992 సంవత్సరంలో ఒకేసారి 12 మూవీస్ చేసింది. మరో 12 చిత్రాల్లో హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసింది.
1992 మే 10 బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1993లో ఏప్రిల్ 5న 19 ఏళ్ల వయసులోనే అనుహ్యంగా మరణించింది. ముంబైలోని తన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మరణించింది. అయితే ఆమె మరణంపై అప్పట్లో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమెది ప్రమాదం కాదని.. కావాలనే హత్య చేశారంటూ ప్రచారం నడించింది. కానీ ఆమె తండ్రి ఆ ఆరోపణలు తోసిపుచ్చాడు. ఇప్పటికీ దివ్యభారతి మరణం వీడని మిస్టరీ.
ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్ను చూస్తే షాకవ్వాల్సిందే..
Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.