Actor Suriya: ఆమె దగ్గర నుంచి తీసుకున్న రూ.25,000 అప్పు.. తీర్చేందుకే నటుడిగా మారిన సూర్య..

|

Oct 25, 2024 | 7:38 AM

కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సూర్య ఇప్పుడు కంగువ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ దీపావళీ కానుకగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Actor Suriya: ఆమె దగ్గర నుంచి తీసుకున్న రూ.25,000 అప్పు.. తీర్చేందుకే నటుడిగా మారిన సూర్య..
Suriya
Follow us on

కోలీవుడ్ హీరో సూర్య దక్షిణాది సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగుల ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలు.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అటు హీరోగా.. ఇటు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే తాను చిన్నప్పటి నుంచి నటుడు కావాలని ఎప్పుడూ కావాలని అనుకోలేదని.. కానీ అమ్మ ఋణం తీర్చుకోవడానికే ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చినట్లు అనేకసార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సూర్య కంగువ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా దీపావళీ కానుకగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కంగువ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

నటుడు కాకముందు సూర్య శిక్షణ పొందుతూ గార్మెంట్ కంపెనీలో పని చేసేవాడినని.. 15 రోజులకు 750 రూపాయలు సంపాదించేవాడినని అన్నాడు. అక్కడ పని చేస్తూ ఉంటే.. మూడేళ్ల తర్వాత ప్రతినెలా 8 వేల రూపాయల జీతం వచ్చేదని.. ఏదో ఒకరోజు సొంతంగా కంపెనీ పెట్టాలనేది అతని ఆలోచన వచ్చేదని చెప్పుకొచ్చాడు. సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడే. శివకుమార్‌కు తెలియకుండా తల్లి లక్ష్మి దగ్గర రూ.25 వేలు అప్పు తీసుకున్నాడు సూర్య. 90వ దశకంలో అది చాలా పెద్ద అమౌంట్. ఆ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాల్లో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పుకొచ్చాడు. 1997లో విడుదలైన ‘నెరుక్కు నాయర్’ చిత్రంలో తొలిసారిగా నటించారు.

సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ తమిళ చిత్రం పలు భాషల్లోకి డబ్ అవుతోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, దిశా పటానీ వంటి బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సూర్య ప్రత్యేక గెటప్‌లో కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.