Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులకు కారణం ఆమెనా.. ? అసలు ఎవరీ నిమ్రత్ కౌర్..

|

Oct 24, 2024 | 9:50 AM

నటుడు అభిషేక్ బచ్చన్ గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఒకవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకుల గురించి చర్చ జరుగుతోంది. మరోవైపు నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ గురించి చర్చ జరుగుతోంది.

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులకు కారణం ఆమెనా.. ? అసలు ఎవరీ నిమ్రత్ కౌర్..
Abhishek, Nimrat
Follow us on

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీరిద్దరి విడాకుల గురించే చర్చ నడుస్తుంది. మరోవైపు నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ డేటింగ్ అంటూ మరో చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పటివరకు దీనిపై అభిషేక్, ఐశ్వర్య స్పందించలేదు. నిమ్రత్ పేరు అభిషేక్‌తో చర్చనీయాంశం కావడంతో ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అభిమానులు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు.. ? బ్యాగ్రౌండ్ ఏంటీ అనే విషయాలపై చర్చ నడుస్తుంది. నిమ్రత్ కూడా 42 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉంది. నిమ్రత్ కౌర్ తండ్రిని కశ్మీర్‌లో తిరుగుబాటుదారులు హతమార్చారు.

ఈ సంఘటన తర్వాత నిమ్రత్ కుటుంబ జీవితం పూర్తిగా మారిపోయింది. ఘటన అనంతరం నటి కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన నిమ్రత్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ప్రారంభించిన తర్వాత, నిమ్రత్ చాలా ప్రకటనలలో నటించే అవకాశం వచ్చింది. నిమ్రత్ బాగ్దాద్ వెడ్డింగ్, రెడ్ స్పారో వంటి చిత్రాల్లో నటించింది.

నిమ్రత్ 2006లో విడుదలైన వన్ నైట్ విత్ ది కింగ్ చిత్రంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ 2012లో విడుదలైన ‘పెడ్లర్స్’ సినిమా ఈ నటికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామకు ‘లంచ్‌బాక్స్‌’ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘దసవి’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. సినిమాలో అభిషేక్ భార్య పాత్రలో నిమ్రత్ నటించింది. ప్రస్తుతం నిమ్రత్ కౌర్ రూ.7 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. హలీవుడ్ లో పలు సీరియల్స్ కూడా చేసింది. అభిషేక్ బచ్చన్ కంటే ముందు, నిమ్రత్ పేరు కూడా భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో ముడిపడి ఉంది. కానీ ఆ వార్తలలో ఎలాంటి నిజాలు లేవని వారిద్దరూ చెప్పారు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.