Tollywood: భర్తతో విడాకులు.. తనకంటే 12 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్.. 51 ఏళ్ల వయసులో తగ్గని క్రేజ్..

|

Oct 23, 2024 | 12:22 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ముఖ్యంగా ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. అయినా చెక్కు చెదరని అందంతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఈ బ్యూట నిత్యం వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది.

Tollywood: భర్తతో విడాకులు.. తనకంటే 12 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్.. 51 ఏళ్ల వయసులో తగ్గని క్రేజ్..
Heroine
Follow us on

సినీరంగంలో విడాకుల తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే జీవితంలోకి మరో కొత్త వ్యక్తిని స్వాగతించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. 19 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికి.. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడితో ప్రేమాయణం నడిపింది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కుర్రహీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తోంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మలైకా ఆరోరా. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న మలైకా.. ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది.

అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. షారుఖ్ ఖాన్ నటించిన దిల్ సే సినిమాలోని చయ్యా చయ్యా పాటతో చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు కూడా ఉన్నాడు. 19 ఏళ్ల తర్వాత వీరి వైవాహిక బంధానికి ముగింపు పలికారు.

మలైకా, అర్బాజ్ 2017లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తనకంటే చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. మలైకా, అర్జున్ 2019లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. మలైకా, అర్జున్ మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉంది. అర్జున్ కపూర్ వయసు 39 ఏళ్లు కాగా, మలైకా వయసు 51 ఏళ్లు. చాలాకాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు విడిపోయినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు. అయితే ఈరోజు కూడా వీరిద్దరికి సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.