లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. అత్యాచారం కేసులో అరెస్టయి ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. జానీ మాస్టర్‌కు ఇచ్చే జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేసినట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. ‘తిరుచిత్తంబలం’ (తెలుగులో తిరు) సినిమాకు గాను జానీ మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు తీసుకోవాల్సి ఉంది. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 8న ఢిల్లీలో స్వీకరించాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కారణంగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. దీంతో అతనిని మళ్లీ రిమాండుకు తరలించే అవకాశం ఉంది. కాగా జానీ మాస్టర్ ‘ఉత్తమ కొరియోగ్రాఫర్’ జాతీయ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే, అత్యాచారం ఆరోపణలపై అరెస్టయ్యాడు. అతని వద్ద పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. హైదరాబాద్, ముంబైలలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా జానీతో పాటు అతని భార్య తనను కొట్టేవారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసలుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది చాలా చెత్త నిర్ణయమంటూ మండి పడుతున్నారు. ఇప్పటికే ఆట సందీప్, యానీ మాస్టర్, బండి సరోజ్ కుమార్ తదితరులు జానీ మాస్టర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. కేసు ఋజువయ్యేవరకూ. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా.. తన #Choreography టాలెంట్ కి తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి ?? This is stupidity ! Sorry !!#Nationalawards #JaniMastercase
— Bandi Saroj Kumar (@publicstar_bsk) October 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..