Jagapathi Babu : తన లైఫ్ స్టోరీని.. తన మాటల్లోనే చెప్పబోతున్న జగపతి బాబు.. సముద్రం పేరుతో వీడియో ప్రెజెంటేషన్..

59 ఏళ్ల క్రితం... అంటూ గతంలోకి తొంగిచూస్తున్నారు హీరో జగపతిబాబు. తన జీవితాన్ని తానే నిశితంగా చదివి.. అభిమానులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Jagapathi Babu : తన లైఫ్ స్టోరీని.. తన మాటల్లోనే చెప్పబోతున్న జగపతి బాబు.. సముద్రం పేరుతో వీడియో ప్రెజెంటేషన్..
ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌ సినిమాలో ప్రధాన పాత్రలో జగ‌ప‌తిబాబు .

Updated on: Jun 18, 2021 | 1:48 PM

Jagapathi Babu :

59 ఏళ్ల క్రితం… అంటూ గతంలోకి తొంగిచూస్తున్నారు హీరో జగపతిబాబు. తన జీవితాన్ని తానే నిశితంగా చదివి.. అభిమానులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకోబోయే అంశాలపై ఇంట్రస్టింగ్ టీజర్ రిలీజ్ చేశారు జగ్గూ భాయ్. ఫ్యామిలీ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్… ఒకటేమిటి… ఒక నటుడిగా అన్ని రకాల షేడ్స్ ని చూపించిన అరుదైన నటుడు జగపతిబాబు. బిగ్ ప్రొడ్యూసర్ వీబీ రాజేంద్రప్రసాద్ తనయుడిగా తెరంగేట్రం చేసినా.. తనకంటూ ఒక ముద్రను వేసుకుని.. 30 ఏళ్లకు పైగా సినిమాతో జర్నీ చేశారు. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపుల్ని చూశారు. మరెన్నో ఆటుపోట్లు ఫేస్ చేశారు. ఒక్క సంవత్సరంలోనే ఏకంగా ఆరు హిట్ మూవీస్ ఇచ్చి టాప్ హీరో అనిపించుకున్నారు. తర్వాత లెజెండ్ మూవీతో విలన్ గా మారి.. కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టి.. మిగతా భాషల్లో కూడా బిజీ అయ్యారు జగ్గు. తండ్రి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక చింతన, విషయం పరిజ్ఞానం జగపతిబాబుని నిండు మనిషిగా చూపెడతాయి.

కృష్ణవంశీ డైరెక్షన్లో తాను చేసిన సముద్రం మూవీ టైటిల్ నే.. తన బయో సిరీస్ కి వాడుకుంటూ… ఇంటెన్స్ ఫీల్ తో ఈ ఫ్రైడే (18న ) ఈవెనింగ్.. వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు జగపతిబాబు. తన లైఫ్ స్టోరీని.. తన మాటల్లోనే చెప్పబోతున్న జగపతి బాబు .. ఏమేం కొత్త సంగతుల్ని రివీల్ చేస్తారు అనేది ఇప్పటికైతే సస్పెన్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Thalapathy Vijay: దళపతి విజయ్ 66వ సినిమా పై క్లారిటీ వచ్చేది ఆరోజేనా..?

Karthika Deepam: నువ్వు నా విషయంలో యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ తట్టుకోలేవు అంటూ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత

Tamil Actor Vijay : విజయ్‌కి 100 కోట్ల పారితోషికమా..! రజనీకాంత్‌ని బీట్ చేశాడా..? తెలుసుకోండి..

Follow Us