ఐశ్వర్య కాదు.. అలియా కాదు.. ఆస్తిపాస్తుల్లో ఆమె తోపు.. అస్సలు ఊహించలేరు

|

Oct 18, 2024 | 7:25 PM

కొంతమంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా భారతదేశంలోని టాప్ 10 సంపన్న నటీమణుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో నటి అలియా భట్ నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరకు చాలా మంది.

ఐశ్వర్య కాదు.. అలియా కాదు.. ఆస్తిపాస్తుల్లో ఆమె తోపు.. అస్సలు ఊహించలేరు
Bollywood
Follow us on

సినిమా సెలబ్రెటీలు చాలా మంది రెండు చేతులా సంపాదిస్తున్నారు. కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఆస్తిపాస్తులు కూడబెడుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా భారతదేశంలోని టాప్ 10 సంపన్న నటీమణుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో నటి అలియా భట్ నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరకు చాలా మంది. అయితే సీనియర్ హీరోయిన్ ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్ ను బీట్ చేసింది. సినిమాలు చేయకపోయినా కూడా కోట్లల్లో కూడబెట్టింది. 90s బ్యూటీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేకపోయినా.. ఆస్తిపాస్తుల్లో ఆమె తోపు. అందాల భామ ఐశ్వర్యరాయ్ రెండో స్థానంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

మొదటి స్థానంలో ఉన్నది మరెవరో కాదు నటి జూహీ చావ్లా . సీనియర్ బ్యూటీ జూహీ చావ్లా గతంలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా మెరిసింది. జూహీ చావ్లా భారతదేశంలోనే అత్యంత సంపన్న నటి. భారతదేశంలోని 10 మంది సంపన్న నటీమణుల జాబితాను ఒక ప్రముఖ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో జుహీ చావ్లా అగ్రస్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

జూహీ గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌కి హిట్ చిత్రాలేమీ చేయనప్పటికీ. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. జుహీ చావ్లా నికర విలువ రూ.4,600 కోట్లు. జూహీ గత పదేళ్లుగా నటనకు దూరంగా ఉంది. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్, ఐపిఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా జుహీ చావ్లా భారీగా డబ్బు సంపాదించింది. అంతేకాకుండా, ఈ ముద్దుగుమ్మ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెడుతుంది. ఇక సంపన్న నటీమణుల జాబితాలో ఐశ్వర్య రెండో స్థానంలో నిలిచింది. జూహీ చావ్లాలా ఐశ్వర్య కూడా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేదు. ఐశ్వర్యరాయ్ ఆస్తులు రూ.850 కోట్లు. ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిలిచారు. ప్రియాంక చోప్రా తన బ్రాండ్, ప్రొడక్షన్ హౌస్ మరియు హాలీవుడ్ సినిమాల నుండి సంపాదిస్తుంది. ఈ బ్యూటీ  మొత్తం సంపద 650 కోట్ల రూపాయలు. అలియా భట్, దీపికా పదుకొణె కూడా టాప్ 5లో ఉన్నారు.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.