Adarsha Kutumbam: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

వెంకటేష్ సినిమాలంటే కుటుంబ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, సహజమైన నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Adarsha Kutumbam: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన వెంకీ - త్రివిక్రమ్ మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
Aadarshakutumbam

Updated on: Oct 20, 2026 | 12:52 PM

టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. మరోవైపు, తనదైన మాటలు, కథాకథనం, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47’ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కు వాయిదా వేశారు. అయితే అనుకున్న సమయానికి సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే

సినిమాకు సంబందించిన కొన్ని పనులు , టెక్నీకల్ వర్క్  సంబంధించిన అంశాల కారణంగా విడుదలను మరోసారి వాయిదా వేశారు. ఫైనల్ గా ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్దమైంది. వరుస వాయిదాలతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త ఊరటనిస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ గతంలో రచయితగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించినప్పటికీ, దర్శకుడిగా త్రివిక్రమ్‌తో వెంకటేష్ చేస్తున్న ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబ కథలు, వినోదాత్మక సన్నివేశాలు, భావోద్వేగాలను తెరపై అద్భుతంగా చూపించడంలో వెంకటేష్‌కు మంచి పేరుంది. త్రివిక్రమ్ తనదైన సంభాషణలు, కథనంతో ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి

రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా

‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌తోనే ఈ సినిమా కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య అనుబంధాలు, జీవితంలోని భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే కథతో రూపొందుతోందనే ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేతా పేతురాజ్, డింపుల్ హయతి సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us