Sharwanand : మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు.. నేను అదే చెప్తున్నా : హీరో శర్వా

బైకర్ తో బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో స్టార్ శర్వా అన్నారు. శర్వా, అభిలాష్ రెడ్డి, యూవీ క్రియేషన్స్ 'బైకర్' హై-వోల్టేజ్ రైడ్‌ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. 

Sharwanand : మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు.. నేను అదే చెప్తున్నా : హీరో శర్వా
Sharwanand

Updated on: Mar 23, 2026 | 6:50 AM

చార్మింగ్ స్టార్ శర్వా, భిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్స్‌లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను సృష్టించాయు. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఇండియన్ రేసర్లు ప్రపంచ స్థాయి ప్రతిభావంతులతో సమానంగా నిలబడగలరా అని ఒక ఫారిన్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ వున్నప్పటికీ, పరిష్కారం కాని సంఘర్షణలు ఉన్న రైడర్‌గా విక్కీ పరిచయం అవుతాడు. అతని పోరాటాలు ట్రాక్‌పైనే కాదు, అతన్ని పెంచి, శిక్షణ ఇచ్చిన తండ్రితో. వారి మధ్య ఉన్న బాండింగ్ కథకు అద్భుతమైన ఎమోషన్ ని యాడ్ చేస్తోంది. శర్వ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. రేసర్ గా ఆయన ప్రజెన్స్ అదిరిపోయింది. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ ట్రాస్ ఫర్మేషన్ మెస్మరైజ్ చేస్తోంది. నను తాను నిరూపించుకోవడానికి తపించే కొడుకు ఎమోషన్ ని అద్భుతంగా పండించారు. శర్వా ఇంటెన్స్ యాక్టింగ్ నెస్ట్ లెవల్ లో ఉంది. రాజశేఖర్ రాజీపడని తండ్రి-గురువుగా పాత్రకు బలాన్ని చేకూర్చారు. ఆయన రీఎంట్రీలో ఇంతటి ఇంటెన్స్ పాత్రలో అతన్ని చూడటం కొత్తగా వుంది. వీరందరూ కలిసి అత్యంత ఉత్కంఠభరితంగా అనిపించే ఒక డ్రామాను అందించారు.

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శర్వా మాట్లాడుతూ.. మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు.. సీనియర్స్ తర్వాతే మేము. సీనియర్స్ ముందు నడుస్తుంటారు. వారి వెనక మేము నడుస్తాం. రాజశేఖర్ గారు ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. దిల్ రాజు గారు చెప్పినట్లు నిర్మాతలు దగ్గరుండి కథలు రాయించి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మంచి విజయవంతమైన చిత్రాలు వస్తాయి. నాకు బాగా గుర్తు శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు గారు దగ్గరుండి పాటలు రాయించుకునేవారు. అలాంటి డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ పరిశ్రమకు కావాలి. వంశి అన్న కూడా తనకు కావలసిన సాంగ్స్ నీ దగ్గరుండి రాయించుకుంటారు. బైకర్ సినిమా గురించి ఒకటే మాట చెప్తాను.. మొన్న చెప్పి హిట్టు కొట్టాను.(నారీనారీ నడుమమురారి) ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. ఈసారి బైకర్ తో బంపర్ బ్లాక్ బాస్టర్ కొడుతున్నాను. ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా తీశాం. ఏప్రిల్ 3న థియేటర్లో కలుద్దాం. సినిమా గురించి ఇంకా మాట్లాడుకుందాం అని చెప్పుకొచ్చారు హీరో శర్వా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us