Hansika Motwani: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న యాపిల్ బ్యూటీ పెళ్లి.. ఎక్కడంటే

|

Nov 14, 2022 | 11:53 AM

చూడగానే ముద్దొచ్చే ఈ అమ్మడి రూపం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

Hansika Motwani: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న యాపిల్ బ్యూటీ పెళ్లి.. ఎక్కడంటే
Hansika
Follow us on

క్రేజీ బ్యూటీ హన్సిక దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. చూడగానే ముద్దొచ్చే ఈ అమ్మడి రూపం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన సి ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసిన హన్సిక.. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ చిన్నది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ భామ పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. తాను డిసెంబర్ లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన హాన్సిక.. కొద్దిరోజుల క్రితం తన కాబోయే భర్త ఫోటోస్ షేర్ చేసింది.

తన బిజినెస్ పార్టనర్ సోహైల్ ఇకపై జీవిత భాగస్వామి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది హాన్సిక. వీరి పెళ్లి వచ్చే నెల 4వ తేదీన జైపూర్ లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో జరగనుంది. గ్రాండ్ గా జరగనున్న ఈ వివాహ ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

వీరి వివాహ వేడుక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ వివాహం కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.