సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల ప్రాధాన్యం చాలా తక్కువ. మహా అయితే ఒకటో రెండో సినిమాల్లో కనిపిస్తారు ఆఖరికి మన టాలీవుడ్లోనూ వీరికి పెద్దగా అవకాశాలు రావు. అందుకే చాలా మంది తెలుగు హీరోయిన్లు ఇతర సినిమా ఇండస్ట్రీకి తరలివెళ్లిపోతున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ అక్కడే సెటిల్ అయిపోతున్నారు. పై ఫొటోలో ఉన్న క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. రాయలసీమ గడ్డపై పుట్టిన ఈ అమ్మడికి అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్నాయి. పైగా తను యాక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. కానీ ఈ సొగసరికి ఆవగింజంత అదృష్టం కూడా లేదు. అందుకే ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. చివరకు గత్యంతరం లేక సినిమాల్లో క్యామియో రోల్స్ చేస్తోంది. సహాయక నటిగా అలరిస్తోంది. మరి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్నట్లూ సినిమాల్లో కనిపిస్తోన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ హీరోయిన్ ది రాయలసీమలోని అనంతపురం జిల్లా. కెరీర్ ప్రారంభంలోనే విజయ్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం వంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ప్రియాంక జవాల్కర్.
అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్ది మరాఠీ కుటుంబం. హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల పాటు MNC కంపెనీలో జాబ్ కూడా చేసింది. అయితే నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2017లో ‘కళవరమాయే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. విజయ్ దేవరకొండ తో కలిసి ‘ట్యాక్సీవాలా’ అనే సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ సినిమాలతో హిట్ కొట్టింది.
సత్యదేవ్ తో ‘తిమ్మరసు’, ‘గమనం’ సినిమాలు కూడా ఓ మోస్తరు విజయం సాధించాయి. అయితే వీటి తర్వాత ఈ అమ్మడికి హీరోయిన్ అవకాశాలు కరువైపోయాయి. అందుకే సిద్దు జొన్నల గడ్డతో కలిసి ‘టిల్లు స్క్వేర్’ లాంటి మూవీలో చిన్న పాత్రలో కనిపించింది. అలాగే భగవంత్ కేసరి సినిమాలోనూ ఓ క్యామియో రోల్ పోషించింది. హీరోయిన్ మెటీరియల్ లాంటి ఈ బ్యూటీకి చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.