Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్

|

Oct 26, 2024 | 5:09 PM

చాలామంది హీరోయిన్లు డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి, అది కూడా లక్షల జీతం ఇచ్చే దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ లో ఉద్యోగాన్ని వదిలి పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్
Tollywood Actress
Follow us on

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడీ పాప పెద్దదై సినిమా హీరోయిన్ గా మారిపోయింది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోల సి చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ముద్దుగుమ్మ. ఇక చాలామంది హీరోయిన్లలాగే ఈ అందాల తార కూడా గతంలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అయితే సినిమాలపై మక్కువతో లక్షల జీతం ఇచ్చే జాబ్ ను వదులుకుంది. సవాళ్లతో కూడిన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ వయసులోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన ఓ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాల నేపథ్యంలో ఈ సినిమాలో మరోసారి ఈ బ్యూటీ పేరు ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలోనూ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ ముద్దుగుమ్మ చెప్పిన సమాధానాలు కూడా బాగా వైరలయ్యాయి. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవలే పొట్టేల్ సినిమాతో మన ముందుకు వచ్చిన అనన్య నాగళ్ల. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది. అయితే ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇటీవల అనన్య నటించిన పొట్టేల్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన బుజ్జమ్మ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఇవి కూడా చదవండి

పొట్టేల్ సినిమా ప్రమోషన్లలో అనన్య నాగళ్ల.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.