Tollywood: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆ పాన్ ఇండియా హీరో భార్య కూడా..

|

Oct 21, 2024 | 10:18 AM

హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లు అవుతున్నా 15 కంటే ఎక్కువ సినిమాలు చేయలేదీ అందాల తార .ఎందుకంటే ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. కథ నచ్చితేనే సినిమా కు ఓకే అంటుంది. లేకపోతే సైలెంట్ అయిపోతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ.

Tollywood: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆ పాన్ ఇండియా హీరో భార్య కూడా..
Tollywood Actress
Follow us on

 

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అలాగే టీవీ హోస్ట్, నిర్మాత కూడా. మ్యూజిక్ వీడియోలూ చేస్తుంది. అంటే మల్టీ ట్యాలెంటెడ్ అమ్మాయి అన్నమాట. ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫీల్ గుడ్ సినిమాల్లో నటిస్తూ యువత కలల రాణిగా మారిపోయింది. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్ కు ఫిదా కాని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. అందుకే చిన్న వయసులో పెళ్లి చేసుకుని సెటిల్ అయినా ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ హీరోయిన్ ఓ పాన్ ఇండియా హీరో సతీమణి కూడా. అతను మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో విలన్ గా నటించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఎక్స్ ప్రెషన్ క్వీన్ నజ్రియా నజీమ్‌. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

రాజా రాణి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది నజ్రియా. అంతకు ముందు పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. అలాగే హీరోయిన్ గా కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అయితే రాజా రాణి సినిమాలో ఈ అమ్మడి నటన, ఎక్స్ ప్రెషన్స్ కు కుర్ర కారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత బెంగళూరు డేస్ తో ఈ అమ్మడి స్టార్ డమ్ బాగా పెరిగిపోయింది. అయితే సినిమా కెరీర్ స్పీడ్ లో ఉండగానే మలయాల హీరో ఫహద్ ఫాజిల్ ను వివాహం చేసుకుందీ అందాల తార. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్లీ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. నజ్రియా గతేడాది నాని తో కలిసి ‘అంటే సుందరానికి’సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించింది.

భర్త ఫాహద్ ఫాజిల్ తో నజ్రియా..

నజ్రియా దంపతుల బ్యూటిఫుల్ ఫొటో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.