Tollywood: బూరె బుగ్గల బుజ్జాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. యాక్టింగ్‏కు దండం పెట్టాల్సిందే..

సినీ తారల చిన్ననాటి ఫోటోస్ అభిమానులకు ఎప్పుడూ ఇష్టమైనవే. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈ చిన్నారి ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నారి.. హీరోయిన్ గా తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలోనే ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా ?..

Tollywood: బూరె బుగ్గల బుజ్జాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. యాక్టింగ్‏కు దండం పెట్టాల్సిందే..
Actress 1
Follow us

|

Updated on: Apr 25, 2024 | 2:11 PM

సినీ తారల చిన్ననాటి ఫోటోస్ అభిమానులకు ఎప్పుడూ ఇష్టమైనవే. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈ చిన్నారి ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నారి.. హీరోయిన్ గా తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలోనే ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా ?.. తనే హీరోయిన్ కీర్తి సురేష్. పైన ఫోటోలో కీర్తి పక్కన కనిపిస్తున్న మరో చిన్నారి ఆమె సోదరి రేవతి. తెలుగు, తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక సినిమాలు చేసింది. బాలనటిగా అడుగుపెట్టి ఇప్పుడు మహానటిగా పేరు సంపాదించుకుంది. కీర్తికి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో కనిపించింది. ఈ మూవీలో కీర్తి నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. తెలుగులో సర్కారు వారి పాట, దసరా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లిగా కనిపించింది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. నటనపరంగా మెప్పించిన ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల కీర్తి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకున్నాయి. చీరకట్టులో మెస్మరైజ్ చేసింది. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ లో శారీలో మెరిసింది. ఆ తర్వాత అదే శారీలో ఫోటోషూట్ చేసింది. అయితే ఆ శారీ ధర మాత్రం రూ. 2,99,000 అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..