Tollywood: ఈ చదువుల తల్లి ఇప్పుడు ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ.. సినిమా చేసిందంటే హిట్టవ్వాల్సిందే..
అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అందం, అభినయంతో యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. వరుస హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఫుల్ బిజీ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేకుండా ఉన్నట్లుండి సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం చేతిలో ఒకట్రెండు చిత్రాలతో నెట్టుకొస్తుంది. ఇంతకీ ఆ చదువుల తల్లిని గుర్తుపట్టారా
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరే గుర్తొస్తుంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అందం, అభినయంతో యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. వరుస హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఫుల్ బిజీ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేకుండా ఉన్నట్లుండి సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం చేతిలో ఒకట్రెండు చిత్రాలతో నెట్టుకొస్తుంది. ఇంతకీ ఆ చదువుల తల్లిని గుర్తుపట్టారా..తనే మలయాళీ కుట్టి సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సంయుక్త సెకండ్ హీరోయిన్. ఆమెకు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే. అయినా తనదైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
భీమ్లా నాయక్ సినిమా తర్వాత సంయుక్త నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఇండస్ట్రీలో సంయుక్తకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. చివరిసారిగా కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. ప్రస్తుతం సంయుక్త తెలుగులో ఒక్క సినిమా చేస్తుంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తోన్న స్వయంభు చిత్రంలో కథానాయికగా అలరిస్తుంది.
2016లో పాప్ కార్న్ సినిమాతో మలయాళం సినీరంగంలోకి అడుగుపెట్టింది సంయుక్త. ఆ తర్వాత అక్కడే వరుసగా మూడు చిత్రాలు చేశాక.. తమిళంలో ఆఫర్స్ వచ్చాయి. ఇక అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు. సంయుక్త సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన చీరకట్టు ఫోటోషూట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. చీరకట్టులో ముద్ద మందారంలా కనిపిస్తుంది సంయుక్త.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.