Faria Abdullah: లక్కీ ఛాన్స్ కొట్టేసిన చిట్టీ.. మంచు వారి అబ్బాయి సినిమాలో ఫారియా..

చిట్టీగా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న ఫారియా అబ్దుల్లా.. ఇప్పుడో క్రేజీ ఆఫర్ను తన బుట్టలో వేసుకున్నారు. ఏకంగా మంచు వారబ్బాయినే ఢీ కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు..

Faria Abdullah: లక్కీ ఛాన్స్ కొట్టేసిన చిట్టీ.. మంచు వారి అబ్బాయి సినిమాలో ఫారియా..

Updated on: Jun 17, 2021 | 11:50 AM

Faria Abdullah:

చిట్టీగా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న ఫారియా అబ్దుల్లా.. ఇప్పుడో క్రేజీ ఆఫర్ను తన బుట్టలో వేసుకున్నారు. ఏకంగా మంచు వారబ్బాయినే ఢీ కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. మంచు విష్ణు హీరోగా.. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కతున్న చిత్రం ఢీ2. ఢీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా ఫిక్సై పోయారట.

రీసెంట్‌ గా జాతిరత్నాలు చూసిన ఈ మూవీ మేకర్స్‌ చిట్టీ కామెడీ టైమింగ్‌ నచ్చడంతో.. ఢీ2లో కూడా ఈ బ్యూటీనే తీసుకోవాలని ఫిక్సైపోయారట. కామెడీ టైమింగ్‌కి తోడు హైట్‌తో విష్ణును మ్యాచ్‌ చేస్తుడండంతో మంచు వారబ్బాయికి ఈ అమ్మాయే కరెక్ట్‌ అంటూ శ్రీను వైట్ల ఫిక్స్‌ అయిపోయారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక యాక్షన్ కామెడీ జానర్లో.. శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే “ఢీ”. 2007లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించి ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విష్ణు, జెనీలియా కెమెస్ట్రీ… బ్రహ్మనందం, శ్రీహారి, జయప్రకాశ్‌ రెడ్డిల కామెడీ టైమింగ్ వెరసి ఈ సినిమాను ఎవర్‌గ్రీన్‌ లిస్ట్లో చేరేలా చేసింది. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun Pushpa: పుష్ప సినిమాలో ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కంపోజర్లను రంగంలోకి దింపనున్నారా..

Manoj Bajpayee: విలక్షణ నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం ఎంత అందుకున్నారో తెలుసా..

Kavitha Son Death: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం… ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి

Loading...
Unable to load recommendations.
Follow Us