Priyamani: ‘న‌ల్ల‌గా ఉంటే త‌ప్పేంటి.. న‌లుపే అంద‌మైంది’.. త‌న‌పై వ‌చ్చిన‌ ట్రోల్స్ ప‌ట్ల స్పందించిన ప్రియ‌మ‌ణి..

|

Jun 14, 2021 | 5:52 AM

Priyamani: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి సెల‌బ్రిటీల‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌ధ్య దూరం త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం వెండి తెర‌పై మాత్ర‌మే చూసి ఆనదించే అభిమానులు ఇప్పుడు న‌టుల‌తో సంభాషించే రోజులు వ‌చ్చాయి. తార‌లు కూడా...

Priyamani: న‌ల్ల‌గా ఉంటే త‌ప్పేంటి.. న‌లుపే అంద‌మైంది.. త‌న‌పై వ‌చ్చిన‌ ట్రోల్స్ ప‌ట్ల స్పందించిన ప్రియ‌మ‌ణి..
Priyamani
Follow us on

Priyamani: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి సెల‌బ్రిటీల‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌ధ్య దూరం త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం వెండి తెర‌పై మాత్ర‌మే చూసి ఆనదించే అభిమానులు ఇప్పుడు న‌టుల‌తో సంభాషించే రోజులు వ‌చ్చాయి. తార‌లు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించ‌డం ఇటీవ‌ల బాగా పెరిగింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. సోష‌ల్ మీడియా వినియోగం దారి త‌ప్పుతుండ‌డంతో తార‌ల‌కు త‌ల‌నొప్పిగా మారుతోంది. సోష‌ల్ మీడియా వేదికగా సెల‌బ్రిటీల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్స్ ఇటీవ‌ల ఎక్కువైపోతున్నాయి. పెద్ద పెద్ద స్టార్ల‌ను సైతం వ‌దిలి పెట్ట‌డం లేదు కొంద‌రు ప్ర‌బుద్ధులు.
తాజాగా త‌న‌కు ఎదురైన ఇలాంటి ఓ చేదు అనుభ‌వాన్నే పంచుకున్నారు న‌టి ప్రియ‌మ‌ణి. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది ప్రియ‌మ‌ణి. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో త‌న శ‌రీర రంగు, బ‌రువుపై ట్రోల్స్ చేస్తున్నార‌ని ప్రియ‌మ‌ణి వాపోయింది. ఫ్యాట్ అండ్ ఆంటీ అని ట్రోలింగ్ చేశార‌ని చెప్పుకొచ్చింది. ఫ్యాట్ అని కామెంట్స్ చేయ‌డంతో చాలా క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గాన‌ని చెప్పిన ప్రియ‌మ‌ణీ.. అయినా ట్రోల్స్ ఆపలేరు అంటూ వాపోయింది. ఇక త‌న శరీర రంగు గురించి వ‌చ్చిన కామెంట్ల‌పై స్పందిస్తూ.. `నేను ముదురు రంగులో ఉన్న వ్య‌క్తిని.. అందులో త‌ప్పు ఏముంది.? మొదట మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎవ‌రినీ న‌ల్ల‌గా ఉన్నార‌ని అనొద్దు. ఎందుకంటే న‌లుపే అంద‌మైన‌ది` అంటూ త‌న‌దైన శైలిలో స‌మాధ‌న‌మిచ్చిందీ జాతీయ ఉత్త‌మ న‌టి.

Also Read: Prabhas : స్పీడ్ పెంచాలని చూస్తున్న పాన్ ఇండియా స్టార్.. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో..

Guinness World Records: కృత్రిమ కాలుతో గోడకుర్చీ…దివ్యాంగ మహిళ గిన్నీస్ రికార్డు – Watch Video

Pamela Satpathy : యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా పమేలా సత్పతి.. బదిలీ అయిన అనితా రామచంద్రన్..