Tollywood : సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. కుర్రాళ్లను కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ

|

Oct 30, 2024 | 1:13 PM

చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన ఈ హీరోయిన్ ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన సైతాన్ అనే వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది.

Tollywood : సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. కుర్రాళ్లను కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ
Tollywood Actress
Follow us on

సినిమాల్లో పాత్ర కోసం నటీ నటులు ఎంత కష్టమైన పడతారు. కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతుంటే మరికొంతమంది మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. అలాగే పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రిస్క్ అయిన చేస్తుంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన ఆమె ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన సైతాన్ అనే వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సిరీస్ లో ఆమె డీ గ్లామర్ లుక్ లో అలాగే బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దేవయాని శర్మ.

ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా

మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది. ఆతర్వాత మెల్లగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఈ అమ్మడు భానుమతి అండ్ రామకృష్ణ అనే సినిమాతో పరిచయం అయ్యింది. నవీన్ చంద్ర ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకుపోయినా.. ఈ చిన్నది మాత్రం మెల్లగా అవకాశాలు అందుకుంది. అలాగే పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమాలో అతని ఫ్రెండ్ గా చేసింది. అలాగే సైతాన్ వెబ్ సిరీస్ లో మెరిసింది.

ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్

ఈ సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్ సినిమాలో నటించింది. రొమాంటిక్ సినిమాలో రఫ్ అండ్ స్టైలిష్ లుక్ లో అలాగే , సైతాన్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది వీటితో పాటు  సేవ్ ది టైగర్స్ సిరీస్ లో చాలా హోమ్లీగా కనిపించింది. ఈ సినిమాలు, సిరీస్ లతో దేవయానికి మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ లో సినిమా చేసింది. అక్కడ లవ్ శుదా అనే సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.