నీ నవ్వే చాలు పూబంతి..! క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ళ గుండెల్లో గుడికట్టించుకుంది ఈ భామ

సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీని గుర్తించండి.? అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ ఇండియన్ క్రష్ అయ్యింది ఆ చిన్నారి.

నీ నవ్వే చాలు పూబంతి..! క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ళ గుండెల్లో గుడికట్టించుకుంది ఈ భామ
Actress
Follow us

|

Updated on: May 02, 2024 | 8:07 PM

సెలబ్రిటీల చిన్ననాటి ఫోటో తమకు కనిపిస్తే చాలు అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తారు. సోషల్ మీడియాలో తాజాగా ఓ సెలబ్రెటీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీని గుర్తించండి.? అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ ఇండియన్ క్రష్ అయ్యింది ఆ చిన్నారి. ఇంతకీ ఆమె ఎవరు.? పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి ఎవరో కనిపెట్టండి చూద్దాం.! చాలా మంది ఆమె ఎవరో కనిపెట్టలేక పోయారు.

పై ఫొటోలో క్యూట్‌గా నవ్వుతు ఆకట్టుకుంటున్న చిన్నది ఎవరో కాదు మమితా బైజు . ‘ ప్రేమలు ‘ సినిమాతో ఈ బ్యూటీ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మమిత 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘సర్వోపరి పాలక్కారన్’ సినిమాలో ఆమె తొలిసారిగా నటించింది. తర్వాత మమిత చాలా సినిమాల్లో నటించింది. ‘ప్రేమలు’ సినిమా ఆమెను స్టార్‌ని చేసింది. ఇందుకోసం ఆరేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మమిత ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ‘రెబల్’ అనే తమిళ సినిమాలో చేస్తుంది మమిత.

ప్రస్తుతం మమిత చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. చిన్నతనంలో కూడా చాలా ముద్దుగా ఉంది. ఆమె 2020లో ‘కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’లో ‘ఉత్తమ సహాయ నటి’ అవార్డును గెలుచుకుంది. విశేషమేమిటంటే మమిత వయసు ఇంకా 22 ఏళ్లు. ఈ వయస్సులోనే ఆమె మంచి ప్రజాదరణ పొందింది. ‘ప్రేమలు’ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాతో మమితకి మంచి పాపులారిటీ వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం OTTలో విడుదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.