AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhoshi Srikar: నవదీప్ జై హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు బిజినెస్ వుమన్‌గా బిజీ బిజీ.. ఎలా మారిపోయిందో చూశారా?

దేశ భక్తి నేపథ్యానాకి బాక్సింగ్ ను జోడించి తేజ జై మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ హీరో నవదీప్ కెరీర్ కు మంచి పునాదిగా నిలిచింది. ఇదే సినిమాలో నవదీప్ కు జోడిగా ఫరా అనే పాత్రలో ఓ అమాయకమైన అమ్మాయి అద్భుతంగా నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువత మనసులను కొల్లగొట్టింది. ఆ హీరోయిన్ పేరు సంతోషి శ్రీకర్.

Santhoshi Srikar: నవదీప్ జై హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు బిజినెస్ వుమన్‌గా బిజీ బిజీ.. ఎలా మారిపోయిందో చూశారా?
Actress Santhoshi Srikar
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 7:01 PM

Share

హ్యాండ్సమ్ హీరో నవదీప్ కథానాయకుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిత్రం జై. ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ ఈ సినిమాను తెరకెక్కించాడు. 2004లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను తెగ ఆకట్టుకుంది. దేశ భక్తి నేపథ్యానాకి బాక్సింగ్ ను జోడించి తేజ జై మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ హీరో నవదీప్ కెరీర్ కు మంచి పునాదిగా నిలిచింది. ఇదే సినిమాలో నవదీప్ కు జోడిగా ఫరా అనే పాత్రలో ఓ అమాయకమైన అమ్మాయి అద్భుతంగా నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువత మనసులను కొల్లగొట్టింది. ఆ హీరోయిన్ పేరు సంతోషి శ్రీకర్. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ టీవీ నటి పూర్ణిమ కూతురే సంతోషి. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబుకు స్వయంగా కోడలు. విజయవాడలో పుట్టి పెరిగిన సంతోషి చెన్నైలో పెరిగింది. 2000లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నవదీప్ సినిమా తో పాటు అల్లు అర్జున్ ఆర్య సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ వచ్చిందట. అయితే జై సినిమాలోనే నటించిందట. హీరోయిన్ గానే కాకుండా సెకెండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించిందీ అందాల తార. జై తర్వాత సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో నటించింది. ఇందులో శ్రీహరి ఇంట్లో పనిచేస్తూ, ‘జాగ్రత్త అంటే వస్తువులు పడేసే’ అమ్మాయి పాత్రలో కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాకు గానూ బెస్ట్ ఫీమేల్ కమెడియన్ కింద నంది అవార్డు కూడా వచ్చింది. వీటి తర్వాత ఒక్కడే, బంగారం, ఢీ చిత్రాల్లో కూడా నటించింది సంతోషి.

కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది సంతోషి శ్రీకర్. అయితే ఖాళీగా ఉండకుండా బిజినెస్ రంగంలో దూసుకెళుతుంది. బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో బిజినెస్ రన్ చేస్తోంది. మేకప్ క్లాసెస్, శారీ డ్రాపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తుంటుంది. చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ తదితర నగరాల్లో సంతోషి శ్రీకర్ బొటిక్స్ ఉన్నాయి. అంతేకాదూ వివిధ ప్రాంతాల్లో ఔత్సాహికులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తోంది. . ఈ బిజినెస్ వ్యవహారాల్లో ఆమె భర్త కూడా తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారట. ఇక సోషల్ మీడియాలోనూ తన బిజినెస్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది సంతోషి. కాగా గతంలో కంటే బాగా మారిపోయిందీ అందాల తార. కాస్త బొద్దుగా కనిపించినా ఆ అందంలో మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఏం తేడా లేదు.

ఇవి కూడా చదవండి

పెళ్లి కూతురికి మేకప్ వేస్తోన్న జై మూవీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us